ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు.. ఫ్లాట్ అద్దెకు తీసుకుని?
ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినది అని చెప్పాలి. ఏకంగా ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు కలిసి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అయితే ఇలా అద్దెకు తీసుకుంది వాళ్ళు ఉండడానికి కాదు. ఏకంగా గంజాయి సాగు చేయడానికి. ఈ క్రమంలోనే ఇటీవల సమాచారంతో ఫ్లాట్ను తనిఖీ చేసిన పోలీసులు.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా గంజాయి సాగు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఎవరికి అనుమానం రాకుండా హైటెక్ స్థాయిలో గంజాయి సాగు చేస్తున్న ఉండడం చూసి ఇక పోలీసులు కూడా ముక్కున వేలేసుకున్నారు.
అయితే మొక్కలు వేగంగా పెరగడానికి గతి ఉష్ణోగ్రతను అత్యాధునిక పద్ధతిలో కరెంటును ఉపయోగించి పెంచారు. అయితే ఇప్పుడు వరకు గంజాయిని నేలపైన సాగు చేయడం చూసి ఉంటారు. కానీ ఎందుకు పూర్తిగా భిన్నంగా ఫ్లాట్ను అద్దెకు తీసుకొని కృతిమంగా సాగు చేస్తూ ఉండడం మాత్రం ఇదే మొదటిసారి అని చెప్పాలి అయితే అహ్మదాబాద్ లోని సర్కేజీ ప్రాంతంలో ఈ గంజాయి సాగును గుర్తించగా.. ఇక ప్రధాన నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నారు. మిగతా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు అని చెప్పాలి. అయితే ఇలా గంజాయి సాగు కోసం ఏకంగా 35 వేల రూపాయలు చెల్లించి మరి రెండు ఫ్లాట్లను అద్దెకు తీసుకున్నారు. ఒక్కో ఫ్లాట్లో 100 మొక్కలను పెంచినట్లు పోలీసులు గుర్తించారు.