పుట్టింటికి వెళ్ళిన భార్య.. భర్త ఆత్మహత్య.. కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే?
ఇంకొంతమంది ఏకంగా భార్యాభర్తల బంధంలో తలెత్తిన చిన్న చిన్న కారణాలతో అక్కడితో జీవిత ముగిసిపోయింది అని భావిస్తూ చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందా అనే భావన ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతుంది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవలోకి చెందినదే అని చెప్పాలి. వాళ్ళిద్దరికీ పెళ్లయింది కొన్నాళ్లపాటు వారి సంసారం సాఫీగానే సాగింది అయితే తొందరగా పిల్లలు కవాలని భర్త ఆశ. కానీ ఇప్పుడే పిల్లలు వద్దు అని భార్య చెప్పింది. అయితే అత్తారింట్లో సరిపడా స్థలం లేకపోవడంతో ఇక వేరు పడదాం అంటూ భర్త పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది భార్య.
కానీ భర్త మాత్రం అందుకు అంగీకరించలేదు దీంతో కోపంతో అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో మనస్థాపం చెందిన భర్త చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. రాజ్ కుమార్ అనే వ్యక్తి సాధనను పెళ్లి చేసుకున్నాడు. 2017 మే లో ఆయన ఆత్మహత్య చేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు అయితే ఇక ఒక సూసైడ్ నోట్ కూడా రాశాడు. భార్యను పిల్లలు కావాలని అడిగితే వాయిదా వేస్తుందని అంతేకాదు తన కుటుంబానికి దూరంగా ఉండాలని ఒత్తిడి చేస్తుందని. చివరికి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో రాశాడు. ఇక ఇదే విషయంపై ఇటీవల కోర్టు విచారణ జరిపి భార్యను నిర్దోషిగా తేల్చింది. భర్తతో నివసించడానికి తగిన స్థలం లేదని పుట్టింటికి వెళ్లడాన్ని తప్పుగా అర్థం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఆమె తన భర్తతో నివసించాలి అనుకోవడాన్ని తప్పు పట్టలేమని కోర్టు తెలిపింది. అంతేకాదు ఈ కేసును కొట్టివేసింది.