పిల్లాడి ప్రాణం తీసిన కార్టూన్స్.. అసలేం జరిగిందంటే?
సోమవారం మధ్యాహ్నం సుమారు మూడు గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు స్థానికులు. పిల్లవాడి తల్లి తన పనిలో నిమగ్నమై ఉండగా ఈ పని చేసాడు. పిల్లవాడు వీధిలోకి వెళ్లకుండా తల్లి ఇంటి తలుపును మూసి ఉంచిందని చెప్పారు వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ అన్నపు నరసింహ మూర్తి గారు. మెట్ల పై ఆడుకుంటూ, గోడ పై దాచి ఉంచిన పసుపు రంగు శాలువాను విద్యుత్తు తీగల పై వేసి కట్టాడు. ఆ తరువాత ఆ శాలువాను మీద కు చుట్టుకున్నాడు పిల్లవాడు. ఆ తరువాత మెట్ల పై నుండి దూకి గోడకు వేలాడుతున్నట్టుగా ఉన్నాడు. ఆ పిల్లవాడు వేలాడుతుండడం చూసి అటుగా వెళ్తున్న ఒక మహిళా సహాయం కోసం కేకలు వేసింది. వెంటనే అతని తల్లి వచ్చి కథతో ఆ శాలువాను కత్తిరించి ఆసుపత్రికి తరలించింది. కానీ అప్పటికే ఆ బాలుడు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
పోలీసుల విచారణ ప్రకారం పిల్లవాడు టీవీ లో ఎక్కువగా కార్టూన్స్ చూస్తూ ఉండేవాడని, ఆ కార్టూన్లలాగానే చెయ్యడానికి ప్రయత్నించే వాడని తెలుస్తుంది. శాలువాను మెడకు చుట్టుకొని ఆడుకునేవాడట. వడ్డదిలో ఉండే తన తాతగారి ఇంట్లో కూడా ఇలాంటి పనే చేసాడట. పోస్ట్ మోర్టమ్ నివేదిక ప్రకారం బాలుడు ప్రమాదవశాత్తు మరణించాడని నిర్ధారించారు వైద్యులు.