తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించి చంపిన కొడుకు.. కారణం ఏంటో తెలుసా?
కానీ ఇప్పుడు సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలీ దయ మానవత్వం చూపించకుండా కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత సొంతవారి నుంచి కూడా ప్రాణహాని ఉంటుందేమో అనే భయం లోనే ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతున్నారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కంబదూరులో ఉభయ కాలనీకి చెందిన గోపీనాథ్, సుజాతమ్మా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు.
అయితే ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు అయ్యాయి. ఇక వారు ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. అయితే కొడుకు ప్రణీత్ ఇంటర్ తర్వాత చదువు మానేసి హైదరాబాద్ నుండి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసగా మారాడు. ఇటీవలే ఉద్యోగం మానేసి ఇంటికి వచ్చాడు. ప్రతిరోజు మద్యం తాగుతూ ఉండేవాడు. ఇటీవల మద్యం కోసం డబ్బులు కావాలని తల్లిదండ్రులను వేధించడం మొదలుపెట్టాడు. కాగా మంచంలో అనారోగ్యంతో పడి ఉన్న తల్లిని మద్యం కోసం డబ్బు అడిగాడు. ఆమె తన వద్ద లేవు అంటూ చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకు.. తల్లి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన అప్పటికే సుజాతము మృతి చెందింది. ఈ విషయం తెలిసి తండ్రి కన్నీరు మున్నీరుగా రోదించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితున్ని అరెస్టు చేశారు.