82 ఏళ్ల భార్యకు.. 89 ఏళ్ల భర్త విడాకులు.. కోర్టు ఏం చెప్పిందంటే?

praveen
ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒకటైన తర్వాత తుదిశ్వాస వరకు ఒకరికి ఒకరు తోడునీడగా ఉంటూ కలిసిమెలసి జీవించాల్సి ఉంటుంది. ఇక ఎన్ని సమస్యలు ఎదురైనా నేనున్నాను అని భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే చివరికి వైవాహిక బంధానికి విడాకులతో స్వస్తి పలకాలి అనుకుంటున్న వారు కనిపిస్తున్నారు తప్ప.. సర్దుకుపోయి దాంపత్య బంధాన్ని నిలబెట్టుకోవాలి అనే ఆలోచన మాత్రం ఎవరిలో కనిపించట్లేదు.


 వెరసి నేటి రోజుల్లో పెళ్లయిన కొన్నాళ్లకే కోర్టు మెట్లు ఎక్కుతూ చివరికి విడాకులు తీసుకుంటున్న జంటలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నేటితరం జంటలను చూసి ప్రభావితం అవుతున్నారో లేకపోతే ఇంకేంటో తెలియదు కానీ నిన్నటి తరం మొన్నటి తరంలో పెళ్లి చేసుకున్న వారు కూడా ఇప్పుడు వృద్ధాప్యంలో విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్న ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉన్నాయి. ఇక ఇటీవల 82 ఏళ్ల భార్యకి 89 ఏళ్ల భర్త విరాకులు ఇవ్వాలని నిర్ణయించుగా సుప్రీంకోర్టు ఇందుకు తిరస్కరించింది. ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఆ దంపతులకు విడాకులు ఇవ్వలేము అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. విడాకుల కేసులు పెరుగుతున్నప్పటికీ భారతదేశంలో వివాహం ఇప్పటికీ పవిత్రమైనదిగా పరిగణించబడుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఇక విడాకులు తీసుకున్న మహిళ అనే కలంకంతో జీవించడం తనకు ఇష్టం లేదని భార్య అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కోర్టు పేర్కొంది  ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. విడాకులు మంజూరు చేస్తే అది భార్యకు అన్యాయం చేసినట్లు అవుతుంది. భారత సైన్యంలో పనిచేసిన భర్త జనవరి 1984లో చెన్నైలో ఉన్నప్పుడు భార్య అతనితో పాటు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. ఈ ఉదంతం తోనే భార్యాభర్తల మధ్య గొడవ మొదలైందని సుప్రీంకోర్టు తెలిపింది. మొదట్లో తన భర్త తల్లిదండ్రులతో.. తర్వాత తన కొడుకుతో ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. తన భార్య చెన్నైలో తనతో ఉండడం నిరంకరించడం.. న్యాయమైన కారణాలు లేకుండా సహజీవనాన్ని వద్దనుకున్న కారణంగా భర్త విడాకులు కోరాడు. జిల్లా కోర్టు విడాకులు మంజూరు చేసిన.. సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ విడాకులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: