పేరెంట్స్ మీద పగ.. బాలికపై దారుణం?
కానీ ఇప్పుడు సాటి మనిషికి ఎలా హాని తల పెట్టాలి అని ఆలోచించే మనుషులు తప్ప.. మానవత్వం జాలి దయ గుణం కలిగిన మనుషులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పాలి. అభం శుభం తెలియని చిన్నారుల విషయం లో కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు ఎంతో మంది. ఇక ఇటీవలే బెంగళూరులో అమానవీయ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఏకంగా పేరెంట్స్ మీద కోపం తో ఒక వ్యక్తి దారుణం గా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని 15 ఏళ్ల బాలికను కుక్కల తో దారుణం గా కరిపించాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
మగడి సమీపం లో నాగరాజు అనే వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ నడిపిస్తూ ఉన్నాడు. అయితే తన ఫామ్ లో పనిచేసేందుకు రావాలని దినసరి కూలీలు అయినా భార్యా భర్తలను అడిగాడు నాగ రాజు. కానీ వాళ్లు మాత్రం పౌల్ట్రీ ఫామ్ లో పని చేసేందుకు ఒప్పు కోలేదు. దీంతో పగ పెంచుకున్నాడు నాగరాజు. ఇక ఆ దంపతులకు 15 ఏళ్ల కూతురు ఉండగా ఆమె స్కూల్ నుంచి వస్తుండగా ఆమెపైకి తన కాపలా శునకాన్ని వదిలాడు. ఈ క్రమం లోనే ఆ కుక్క ఆ బాలికను తీవ్రంగా గాయపరిచింది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.