కూతురు దళిత యువకుడిని ప్రేమించిందని.. తండ్రి ఏం చేశాడో తెలుసా?
వెరసి ఇంకా టెక్నాలజీ యుగంలో కూడా పరువు హత్యలు జరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. కులం పేరుతో దారుణాలు జరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఏకంగా సొంత వాళ్ల విషయంలో కూడా కాస్తయినా జాలి దయ చూపించడం లేదు. ఏకంగా అత్యంత దారుణంగా మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. ఇక ఇటీవల ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఈ కోవాలోకి చెందినదే ఏకంగా అల్లారూ ముద్దుగా పెంచుకున్న కూతురు తమకంటే తక్కువ కులం వాడిని ప్రేమించింది అన్న కారణంతో ఆ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు.
ఏకంగా కూతురిపై కొండంత ప్రేమ ఉన్న పరువు పోతుందనే ఆలోచన ముందు ఆ ప్రేమ కూడా కనుమరుగైపోయింది. దీంతో కన్న కూతురుని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. కూతురు దళిత యువకుడుని ప్రేమించడంతో అమ్మాయి తండ్రి.. ఈ దారుణానికి ఒడిగట్టాడు. రెండు నెలల క్రితం ప్రియుడితో 17 ఏళ్ల పల్లవి పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు పట్టుకున్నారు. దీంతో తండ్రి గణేష్ బంధువుల ఇంట్లో విడిచిపెట్టాడు. అయితే ఈ నెల 14న ఆమె ఎక్కడి నుంచి కూడా మళ్లీ పారిపోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పరువు పోతుందని పల్లవితో గొడవకు దిగిన తండ్రి గణేష్ కోపంలో కత్తితో కూతురుని దారుణం గా నరికి చంపాడు.