భార్యా బతికుండగానే.. డెత్ సర్టిఫికెట్ సృష్టించిన భర్త.. ఎందుకో తెలుసా?
కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం భార్య విషయంలో అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. భార్య బతికుండగానే ఆమె చనిపోయింది అని మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా సృష్టించాడు. ఈ ఘటన కాస్త సంచలనగా మారిపోయింది. ప్రకాశం జిల్లా హజరత్ గూడెం గ్రామానికి చెందిన కానిస్టేబుల్ శివ శంకరయ్యకు మహబూబ్ నగర్ కు చెందిన మాధవి తో 16 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే మాధవి పేరుతో రైతు నగరం ప్రాంతంలో నాలుగు సెంట్ల స్థలాన్ని శివశంకరయ్య కొనుగోలు చేశాడు.
అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో కొంత కాలం నుంచి శివశంకరయ్యకు మాధవి దూరంగానే ఉంటుంది. ఇద్దరు కుమారులను కూడా తీసుకొని పుట్టింట్లో ఉంటుంది మాధవి. ఈ క్రమంలోనే రైతు నగరంలో ఉన్న నాలుగు సెంట్ల స్థలాన్ని కానిస్టేబుల్ శివ శంకరయ్య ఎలాగైనా కాజేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే గిద్దలూరు ఆసుపత్రిలో మాధవి మృతి చెందినట్లు ఒక సర్టిఫికెట్ను తీసుకున్నాడు. దీని ఆధారంగా భార్య పేరు పై ఉన్న ఆస్తిని తన సోదరి ఆదిలక్ష్మి పేరిట నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేశాడు. విషయం తెలుసుకున్న మాధవి తన భర్త పై పోలీసు కేసు పెట్టింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేయడం మొదలెట్టారు.