షాకింగ్ : క్రికెట్ ఆడుతూ చనిపోయారూ?
ఇవన్నీ చాలు అన్నట్లు ఇటీవల కాలంలో సడన్ హార్ట్ ఎటాక్లు ప్రతి ఒక్కరిని కూడా భయపెడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అప్పటివరకు సంతోషంగా గడిపిన వారు చూస్తూ చూస్తుండగానే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక వారిని రక్షించేందుకు అవకాశం లేకుండా పోతుంది అని చెప్పాలి. ఏకంగా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిరోజు వ్యాయామం చేసేవారు కూడా ఇలా సడన్ హార్ట్ ఎటాక్లకు గురవుతూ ఉన్న ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏకంగా ఇలాంటి రెండు మరణాలు సంభవించాయి.
క్రికెట్ ఆడుతూ వేరువేరు చోట్ల ఇద్దరు యువకులు సడన్ హార్ట్ ఎటాక్ కారణంగా మృత్యువాత పడ్డారు. మధ్య ప్రదేశ్ లోని కట్కూర్ లో ఇందల్ సింగ్ అనే 22 ఏళ్ల యువకుడు.. బౌలింగ్ చేస్తూ ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే స్నేహితులందరూ అతని వెంటనే ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇక యూపీలోని హసన్ పూర్ కి చెందిన 17 ఏళ్ల ప్రిన్స్ సైని మ్యాచ్ ముగిసిన తర్వాత చల్లని నీరు తాగుతూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. ఇక అతని ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గుండెపోటు మరణానికి కారణం అని వైద్యులు తెలిపారు.