తలకి రాయి తగిలిందనుకొని అలాగే మందు తాగాడు.. చివరికి హాస్పిటల్ కి వెళ్తే?

praveen
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి సొంత హెల్త్ గురించి ఆలోచించే సమయమే లేకుండా పోయింది. ఇక ఆరోగ్య సమస్యలు ఉన్న పట్టించుకోవడం మానేశాడు మనిషి. బిజీ లైఫ్ ను గడుపుతూ ఉన్నాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి బిజీ లైఫ్ లో కొన్ని కొన్ని సార్లు ఒంట్లో బాగా లేకపోయినప్పటికీ కొంతమంది  అవి ఏవి పట్టించుకోకుండా రోజువారి పనులకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. కానీ ఆ తర్వాత గాని అతనికి ఒక పెద్ద అపాయం నుంచి బయటపడ్డాను అనే విషయం అర్థం కాలేదు.

 తలకు గాయమై రక్తం కారుతున్న అతను పెద్దగా పట్టించుకోలేదు. ఏదో చిన్న గాయమై ఉంటుందిలే అంటూ నిర్లక్ష్యం చేశాడు. అలాగే నూతన సంవత్సర వేడుకల్లో నాలుగు రోజులపాటు మునిగితేలాడు. చివరికి అతడు చేయి అసంకల్పితంగా కదలటం ప్రారంభించింది. అతనికి నిస్సత్తుగా వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లగా అతన్ని పరీక్షించిన వైద్యుడు తలలో బుల్లెట్ ఇరుక్కుపోయి ఉండడాన్ని గుర్తించి షాక్ అయ్యాడు. వైద్యులు చెప్పింది విన్న మాటియాన్ కి కూడా ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. తలపై రాయి తగిలి ఉంటుందిలే అని లైట్ తీసుకున్న అతనికి ఏకంగా తలలో బుల్లెట్ ఉంటుంది అని తెలిసి అవ్వక్కయ్యాడు. తుపాకీ పేలిన శబ్దం కూడా తనకు వినిపించలేదని.. అలాంటి శబ్దం వినిపించిన గుర్తుపట్టే వాడిని అంటూ చెప్పుకొచ్చాడు మాటైయాన్.

 చివరికి వైద్యులు అతడి మెదడులో ఇరుక్కున బుల్లెట్ ను తొలగించే క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. ఇక ఆపరేషన్ విజయవంతం కావడంతో వైద్యులు మాటియన్ ని తల్లి కూడా ఒకరి పీల్చుకున్నారు. అయితే రెండు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు చివరికి బుల్లెట్ ను బయటకు తీశారు. కాగా తన కుమారుడికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు తాను ఎంతగానో టెన్షన్ పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది మాటియన్ తల్లి. బుల్లెట్ దిశలో ఏ చిన్న మార్పు జరిగిన మాటియాన్ ప్రాణాలు పోయేవి అంటూ వైద్యులు చెప్పుకొచ్చారు. బ్రెజిల్ దేశంలోని డి  రెజీనో నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: