సభ్య సమాజం తలదించుకునే ఘటన.. 3 ఏళ్ళ చిన్నారిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం?
దీంతో ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ తమ కాళ్ళ మీద తాము నిలబడి మహిళా సాధికారతవైపుగా అడుగులు వేస్తున్న ఎంతోమందిని.. ఇక కామపు కోరలు వెనక్కి లాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి. అయితే కేవలం పెద్ద వాళ్లు మాత్రమే కాదు అభం శుభం తెలియని చిన్నారులపై.. కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత దారుణమైనది. ఏకంగా మూడేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన అందరిని నోరేళ్లపెట్టేలా చేస్తుంది. ఇది ఎక్కడో కాదు హైదరాబాద్ నగరంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.
పవనపురి కాలనీలో పక్కపక్క పోర్షన్ లలో రెండు కుటుంబాలు అద్దెకి ఉంటున్నాయ్. అయితే ఆదివారం సాయంత్రం ఒక కుటుంబానికి చెందిన చిన్నారి ధాబాపై ఆడుకుంటుంది. అదే సమయంలో మరో కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలుడు వెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే బాలిక ఇంట్లోకి ఏడ్చుకుంటూ వెళ్లడంతో గమనించిన తల్లిదండ్రులు అత్యాచారం జరిగింది అన్న విషయాన్ని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.