సూపర్ టెక్నాలజీ.. అలెక్సా చిన్నారి ప్రాణాలను కాపాడింది?

praveen
నేటి రోజుల్లో అందుబాటులోకి వస్తున్న అధునాతన టెక్నాలజీ మనిషి జీవనశైలిలో ఎంతలా మార్పులు తీసుకొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఏ పని చేయాలన్నా చెమటోడ్చి  కష్టపడేవాడు మనిషి. కానీ ఇప్పుడు ఒక్క చుక్క కూడా చెమట చిందించకుండానే కూర్చున్న చోటు నుంచి అన్ని పనులను చేసేస్తున్నారు. ఇలా కేవలం ఒక్క మాటతో పనులన్నీ చేసి పెట్టే టెక్నాలజీతో కూడిన పరికరాలు ఇప్పటికే మనిషికి అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో అలెక్సా కూడా ఒకటి. అలెక్స అనే టెక్నాలజీ నేటి రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది.

 మరి ముఖ్యంగా ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ పరికరాలలో అలెక్స అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. దీంతో అలెక్స అది చేయి.. ఇది చెయ్ అంటూ కూర్చున్న చోటు నుంచి ఆదేశాలు ఇస్తే చాలు అలెక్స చెప్పినవన్నీ చేసేస్తూ ఉంటుంది. ఇక ఈ టెక్నాలజీకి అటు మనిషి కూడా బాగా అలవాటు పడిపోయాడు. చేయాల్సిన పనులన్నీ అలెక్సనే  చేసేస్తూ ఉండడంతో ఈ టెక్నాలజీని తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టేసుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు అలెక్స చెప్పిన పనులన్నీ చేసి అవసరాలు తీరుస్తుంది అని మాత్రమే అందరికి తెలుసు. కానీ ఇక్కడ ఏకంగా మనుషుల ప్రాణాలను కాపాడింది.

 అదేంటి అలా ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు కదా. యూపీలోని బస్తీ జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. 13 ఏళ్ల బాలిక నికిత అలెక్సా సహాయంతో 15 నెలల చిన్నారి ప్రాణాలు కాపాడి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. బాలిక తన అక్క కూతురుతో ఆడుకుంటూ ఉండగా.. కోతులు ఇంట్లోకి వచ్చి సామాన్లన్నీ చిందర వందర  చేస్తూ బీభత్సం సృష్టించాయి. అయితే అక్కడే ఆడుకుంటున్న చిన్నారి వద్దకు కూడా కోతులు వచ్చేందుకు ప్రయత్నించాయి. అంతలో ఎంతో చాకచక్యంగా ఆలోచించిన నిఖిత అలెక్సా కు కుక్కల శబ్దం చేయాలి అంటూ చెప్పింది. దీంతో అలెక్స కుక్కల శబ్దం చేయడంతో కోతులు అక్కడ నుంచి పరార్ అయ్యాయి. ఇలా ఏకంగా అలెక్సా సహాయంతో చిన్నారి ప్రాణం కాపాడింది బాలిక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: