రూ.150 కోసం.. అతను చేసిన పనికి అందరూ షాక్?
అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనల గురించి.. తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 150 రూపాయల కోసం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కోసమే భార్యా పిల్లలు బ్రతుకుతున్నారని.. ఒకవేళ తాను ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు రోడ్డున పడతారు అన్న విషయాన్ని ఎక్కడ ఆలోచించలేదు. ఇలా క్షణికావేషంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన చివరికి ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
భార్య 150 రూపాయలు అడిగితే ఇవ్వలేదు అని మనస్థాపానికి గురైన భర్త చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఒడిస్సా కు చెందిన దింటూ సాహూ అనే 24ఏళ్ల యువకుడు బీష్ణు సహస్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే బతుకుదెరువు నిమిత్తం ఒడిశా నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి షామీర్పేట్ పరిధిలోని మజీద్పూర్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తనకు 150 రూపాయలు ఇవ్వాలి అంటూ భార్యను అడిగాడు. కానీ ఆమె మాత్రం తన దగ్గర లేవు అంటూ చెప్పింది. దీంతో ఇదే విషయంపై భార్యతో గొడవపడ్డాడు. ఇక భార్యతో గొడవపై తీవ్ర మనస్తాపం చెందిన దుంటూ సాహూ చివరికి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.