థ్రిల్ వస్తుందని.. అలా చేసిన యువకుడు.. చివరికి యువతి ప్రాణం పోయింది?
ఈ క్రమంలోనే ఇలాంటి మత్తులో ఎంతోమంది ఏకంగా హత్యలు చేయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అయితే ఇలా డ్రగ్స్ వాడుతూ అదే మాయలో మునిగి తేలుతున్నవారు డ్రగ్స్ తీసుకుంటే ఏం వస్తుంది.. ఆరోగ్యానికి హానికరం కదా అని అడిగితే.. డ్రగ్స్ తీసుకుంటే వచ్చే మత్తు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఆ థ్రిల్ మరో లెవెల్ లో ఉంటుంది అంటూ సమాధానం చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ థ్రిల్ కోసం ఒక యువకుడు చేసిన పని యువతి ప్రాణాలు పోవడానికి కారణమైంది.
థ్రిల్ వస్తుంది అంటూ స్నేహితుడు యువతికి డ్రగ్స్ ఇవ్వడంతో చివరికి ఆమె చనిపోయింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. లక్నోలో వెలుగు చూసిన ఈ ఘటనతో అందరూ షాక్ లో మునిగిపోయారు. బెంగళూరుకు వెళ్లే ముందు డ్రగ్స్ కావాలని యువతి నాకు ఫోన్ చేసింది. ఫ్రెండ్ ఫ్లాటుకు తీసుకెళ్లి అక్కడ ఇంజక్షన్ లో డ్రగ్స్ కలిపి ముందు నేను తీసుకొని తర్వాత ఆమెకు ఇచ్చాను అంటూ.. ఇలా యువతి చనిపోయిన కేసులో అరెస్ట్ అయిన నిందితుడు వివేక్ పోలీస్ విచారణలో వెల్లడించాడు. కాగా డ్రాగ్స్ కు బానిసైన వివేక్ యువతికి కూడా ఇలా మాదకద్రవ్యాలను అలవాటు చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.