చెల్లి పెళ్లికి గిఫ్ట్ ఇచ్చాడని.. భర్తను చంపేసిన భార్య?
పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతున్న భార్య భర్తలు నిజంగా భార్య భర్తలేనా లేకపోతే బద్ధ శత్రువుల అన్న విధంగా ప్రవర్తన తీరు మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా చిన్న చిన్న కారణాలకి కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరహా ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపాటుకు గురి చేస్తూ ఉన్నాయి. సాధారణంగా సినిమాల్లో చూపించినట్లుగానే.. నిజ జీవితంలో కూడా చాలామంది భార్యలు ఆడపడుచులతో మాట్లాడకుండా.. ఇక పేరు ఎత్తితేనే కోపంతో ఊగిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు.
ఇక్కడ ఒక భార్యకి తన భర్త చెల్లి అంటే అసలు నచ్చదు. ఆమెతో ఎప్పుడు మాట్లాడిన భర్త పై కోపడుతూ ఉండేది. అయితే ఇటీవల ఏకంగా పెళ్లికి తన సోదరికి గిఫ్ట్ ఇచ్చాడు అన్న కారణంతో సొంత భర్తని చంపేసుకుంది భార్య. ఈ ఘటన యూపీలో వెలుగులోకి వచ్చింది. భారా బంకేకి చెందిన చంద్రశేఖర్ చెల్లికి ఈ నెల 26వ తేదీన పెళ్లి నిశ్చయం కావడంతో.. టీవీ, గోల్డ్ రింగ్ బహుమతిగా ఇచ్చాడు. ఇది నచ్చని అతని భార్య అతనితో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలోనే తన సోదరుని పిలిపించి ఇద్దరు కలిసి చంద్రశేఖర్ ను రెండు గంటల పాటు కర్రలతో కొట్టారు. ఇక తర్వాత ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.