పాపం.. ఆ పేరెంట్స్.. కొడుకు ప్రాణం ఇలా పోతుందని ఊహించలేదు?
అనూహ్యమైన రీతిలో చివరికి ప్రాణాలు పోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు కనీసం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా విధి మరింత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. చివరికి చిన్నారులను మృత్యువు ఒడిలోకి చేర్చి తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను మిగులుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఇలాంటి ఘటనలు ఎంతో మంది మనసును మెలిపెడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. తెలిసి తెలియక ఒక చిన్నారి చేసిన పని చివరికి తల్లిదండ్రులకు కడుపుకోతను మిగిల్చింది.
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్ నందు గవ్ లో వెలుగులోకి వచ్చింది. ఓ పెళ్లి ఫంక్షన్ లో స్పెషల్ ఎఫెక్ట్ కోసం డ్రై ఐస్ ఉపయోగించారు. అయితే తెలిసి తెలియని వయస్సు కావడంతో ఇక బాలుడు ఆ డ్రై ఐస్ ను తిన్నాడు. దీంతో వెంటనే అస్వస్థతకు గురయ్యాడు. అయితే గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చివరకు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సాలిడ్ కార్బన్డయాక్సైడ్ గా పిలుచుకునే డ్రై ఐస్ ఎంతో ప్రమాదకరం. ఐస్, ఇతర ఆహార పదార్థాలను నిలుపు ఉంచేందుకు దీనిని వాడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలను దీనికి దూరంగా ఉంచాలి.