నచ్చిన కారు పెట్టలేదని.. పీటల మీదే వరుడు ఏం చేశాడో తెలుసా?
అయితే ఎంత కట్నం ఇస్తున్నారు అని అటు అబ్బాయి తరపు బంధువులు చూస్తూ ఉండడంతో ఇలా పెళ్లి అనే విషయం నేటి రోజుల్లో కమర్షియల్ ఎలిమెంట్ గా మారిపోయింది. అయితే సేమ్ సినిమాల్లో లాగానే అటు నిజజీవితంలో కూడా ఏమాత్రం కట్న కానుకలు తగ్గిన పెళ్లి పీటల మీదే పెళ్లి ఆపేయడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు తెరమీదకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. కోరిన కారును కట్నంగా ఇవ్వలేదు అనే కారణంతో వరుడు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ముజ్ ఫర్ నగర్ లో వెలుగులోకి వచ్చింది.
పెళ్ళికొడుకు అమీర్ అలా కట్నం గా హుందాయి క్రెటా కారును కోరాడు. అయితే వధువు తల్లిదండ్రులు కూడా కారును బహుమతిగా ఇస్తామని ముందు చెప్పారు కానీ పెళ్లి సమయానికి డబ్బులు సర్దుబాటు కాకపోవడంతో ఇక పెళ్ళికొడుకు అడిగిన హుండాయ్ క్రెటా కార్ కి బదులు అటు మారుతి వ్యాగన్ఆర్ కారును కట్నంగా ఇచ్చారు. ఇక చివరి నిమిషంలో ఈ విషయాన్ని తెలుసుకున్న వరుడు ఇక తనకు ఇష్టమైన కారును కొనలేదు అనే కారణం చెబుతూ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో వధువు కన్నీటి పర్యంతమయింది. అయితే తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వరుడును శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.