ఓరినాయనో.. చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు?

praveen
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే ఘటనలు చూసిన తర్వాత అందరూ షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే టీవీలో చూపించినట్లుగా.. నిజ జీవితంలో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా అని అనిపించేలాగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో పైకి మధ్యతరగతి వాళ్ళలా కనిపించినప్పటికీ లోలోపల మాత్రం వందల కోట్ల నల్లధనాన్ని దాచిపెడుతున్న కోటీశ్వరులు చాలామంది బయటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వారికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తున్నాయ్.
 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ఒక చెప్పుల దుకాణం నడుపుతున్న వ్యాపారి దగ్గర డబ్బు ఎంత ఉంటుంది అంటే మహా అయితే కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి అని సమాధానం చెబుతూ ఉంటారు ఎవరైనా. కానీ ఇక్కడ చెప్పులు కుట్టే వ్యాపారి మాత్రం చాలా రిచ్. రిచ్ అంటే అంతా ఇంతా కాదు. ఏకంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వారికి సైతం ఉండనంత ఆస్తులు కలిగి ఉన్నాడు ఈ చెప్పుల వ్యాపారి. అతని ఆస్తుల వివరాలు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి.

 ఎందుకంటే ఇటీవలే అతని ఇంట్లో ఐటి అధికారులు రైడ్స్ నిర్వహించగా 100 కోట్ల రూపాయల డబ్బును గుర్తించారు  యూపీలో ఈ షాకింగ్ కట్టిన వెలుగులోకి వచ్చింది. ఓ చెప్పులు వ్యాపారింట్లో ఐటి అధికారులు 100 కోట్లు గుర్తించడం సంచలనంగా మారిపోయింది. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన ఇల్లు ఆఫీసులపై ఐటీ దాడులు చేశారు అధికారులు  అయితే మొత్తం 14 ప్రాంతాల్లో రెండు రోజులు సోదరులు నిర్వహించారు  ఈ తనిఖీలలో ఓ వ్యాపారి ఇంట్లో 100 కోట్ల రూపాయలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మంచాలు అల్మారాలు బ్యాగుల్లో నోట్ల కట్టాలను కుక్కారు. అయితే వాటిని లెక్కించేందుకు ఏకంగా క్యాష్ మెషిన్లు సైతం మొరాయించాయ్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: