పట్టాలపైకి వచ్చిన సింహాల గుంపు.. లోకో పైలట్ ఏం చేసిందో తెలుసా?

praveen
సాధారణంగా రైలు ఒక్కసారి కూత అందుకున్న తర్వాత ఇక మధ్యలో ఆగడం అసాధ్యమని చెప్పాలి. అయితే ఇలా మధ్యలో రైలుని అర్ధాంతరంగా ఆపేందుకు అటు లోకో పైలట్లకు కూడా ఎలాంటి అధికారం ఉండదు. దీంతో కొన్ని కొన్ని సార్లు ఏకంగా పట్టాలపై మనుషులు కనిపించిన.. పశువులు కనిపించిన కూడా రైలు వాటిని ఢీకొడుతూనే ముందుకు దూసుకుపోతూ ఉంటుంది తప్ప.. ఎక్కడ ఆగదు అని చెప్పాలి. ఇలాంటిది సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా చాలా సార్లు చూసాం.

 ఈ క్రమంలోనే ఇలా పట్టాలపై రైలు దూసుకు వెళ్తున్న సమయంలో పొరపాటున ఆ పట్టాల మీదికి వచ్చిన మూగజీవాలు ఎన్నో ఇప్పటివరకు బలయ్యాయి  ఏకంగా గొర్లు, మేకలు సహా ఏకంగా ఎద్దులు లాంటి మూగజీవాలు ఇప్పటివరకు రైలు ఢీ కొట్టిన ఘటనల్లో మృతి చెందాయి. అయితే మనుషులు పట్టాల మీద కనిపిస్తేనే లోకో పైలట్ రైలు అస్సలు ఆపడు. అలాంటిది ఏకంగా వన్యమృగాలు పట్టాలపై కనిపిస్తే లోకో పైలెట్ ఏం చేస్తాడు ఆపకుండా రైలు అలాగే పోనిస్తాడు అని అందరూ అంటారు. కానీ ఇక్కడ మాత్రం లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు.

 ఏకంగా రైలు పట్టాలపై దూసుకు వస్తున్న సమయంలో ఒక సింహాల గుంపు పట్టాల పైకి వచ్చింది. దీంతో లోకో పైలట్ ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఆ సింహాల గుంపు ప్రాణాలను కాపాడగలిగారు. గుజరాత్ రైల్వే ట్రాక్పై తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒకేసారి పది సింహాలు ట్రాక్ పైకి వచ్చేసాయి. అదే మార్గంలో వెళ్తున్న గూడ్స్ రైలు లోకో పైలట్ వాటిని చూసి ఎమర్జెన్సీ బ్రేక్ వేసింది. అయితే అవి ట్రాక్ పై నుంచి వెళ్లేంతవరకు వేచి చూసింది. ఆ తర్వాత రైలు బయలుదేరింది. దీంతో లోకో పైలట్ మీనా చర్యను అధికారులు ప్రశంసించారు. కాగా భావనగర్ డివిజన్లో వన్యప్రాణుల సంరక్షణకు నిరంతరం కృషి చేస్తాము అంటూ రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: