ఇతనో సాధారణ ఆటో డ్రైవర్.. కానీ చూస్తే అబ్దుల్ కలాం గుర్తొస్తారు?
మరి అలాంటివారు భిన్నంగా అనిపించినపుడు చూడడానికి చాలా క్రేజీగా అనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో జనాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్రలో అమరావతి జిల్లాకు చెందిన 60 సంవత్సరాలు పైబడిన వృద్దుడు ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఓస్.. అందులో గొప్పతనం ఏముందని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్.. అతగాడు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ విదేశాలకు వెళ్లాలనుకునే యువతకు మంచి సందేశాన్ని ఇచ్చాడు. ఎలా అంటే... ఇంగ్లీష్ లెక్చరర్ కూడా మాట్లాడలేనంత స్పష్టంగా, అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ అందర్ని ఆకర్శించడండోయ్.
అదే ఇక్కడి మేటర్. ఇంగ్లీష్ భాషకు విదేశాల్లో ఉన్న ప్రాధాన్యతను ఓ యువకుడికి వివరించాడు. ఇండియా నుంచి ఎవరైనా విదేశాలకు వెళ్లాలంటే కచ్చితంగా పూర్తిగా ఇంగ్లీష్ లో మాట్లాడటం, చదవగలిగిన సామర్ధ్యం పెంచుకోవాలి అని సూచించాడు. దాంతో ఆటో డ్రైవర్ రూపంలో పెద్దాయన ఇచ్చిన సలహా ఎంత విలువైనదో తెలుసుకొని నెటిజన్లు ఆయన్ని ప్రశంసిస్తున్నారు. అంతేకాకుండా ఇంగ్లీష్ లో మనోడు ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడటాన్ని చూసి అవాక్కవుతున్నారు. ఈ వీడియోకి ఇప్పటికే మిలియన్స్ వ్యూస్, లక్షల్లో లైక్ లు వస్తున్నాయి. విద్యా, విజ్ఞానం ఎవరి సొత్తు కాదు అని నిరూపించాడు ఆ తాత. అయితే ఈ ఆటో డ్రైవర్ వీడియో వైరల్ కావడానికి మరో కారణం కూడా ఉంది. ఆటోడ్రైవర్ గా ఉన్న వృద్ధుడు తన ఆటోలో షేరింగ్ ద్వారా ఎక్కిన ప్యాసింజర్ కు ఇంగ్లీష్ భాషకు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రాముఖ్యత గురించి కనువిప్పు కలిగించాడు.