గుజరాత్ లో కొత్త వైరస్.. 14 కేసులు, 8 మంది మృతి?
ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవడం దానికి తోడు కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావడంతో.. ఇక ఇప్పుడూ కరోనా వైరస్ కేసుల సంఖ్యనమోదు కావడం లేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కరోనా నుంచిబయటపడ్డాము అనుకునే లోపే మరిన్ని ప్రమాదకరమైన వైరస్ లు ఏకంగా మనుషుల ప్రాణాలను గాల్లో కలిపేసేందుకు పేరు మీదికి వస్తూనే ఉన్నాయి. దీంతో ప్రతిక్షణం ప్రాణాలను కాపాడుకునేందుకు మనిషి ఇక ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి.
ఇక ఇప్పుడు గుజరాత్లో మరో ప్రమాదకరమైన వైరస్ వెలుగులోకి వచ్చింది. చాందీపురలో వైరస్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. ఇప్పటివరకు మొత్తం 14 కేసులు నమోదు అవ్వగా.. వారిలో ఏకంగా 8 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రిషికేష్ పటేల్ తెలిపారు. అయితే రోగుల రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు చెప్పుకొచ్చారు. ఈ వ్యాధి దోమలు కీటకాల ద్వారా కూడా సోకుతుంది అంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం మెదడువాపు ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి.