విశాఖ పట్నంలో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు మోజులో పడి భార్యను దూరం పెట్టాడు ఓ భర్త. అయితే... భర్త వేరే మహిళతో ఉంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టు చేసిన ఇల్లాలు..వారిందని దంచికొట్టింది. ఈ సంఘటన విశాఖలో జరిగింది. ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న భార్యను వదిలేసిన భర్త.... స్పా లో పరిచయం అయిన యువతీతో రాసలీలలకు పాల్పడ్డాడు.
ప్రేయసి మీద మోజుతో విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు భర్త. చెట్టా పట్టాలెసుకొని పార్కులు, బీచ్ లు, హోటల్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు ప్రియుడు, ప్రియురాలు. ఇందులో భాగంగానే.. విశాఖలోని సీతమ్మదారలోని ఓ అపార్ట్మెంట్ లో మకాం వేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2020 డిసెంబర్ 17న వివేక్ కు హరితతో పెళ్లి జరిగింది. హరితది చోడవరం కాగా వివేక్ ది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. అయితే.. భార్య పొట్టిగా ఉందని విడాకులు ఇవ్వడానికి సిద్దపడ్డాడు భర్త.
ఈ తరుణంలోనే... పెళ్లయిన 3 నెలలు తర్వాత స్పా లో వివేక్ కు మాధురి పరిచయమైందట. పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధం దారి తీసిందట. అనంతరం స్కూటి, నగలు, విలువైన వస్తువులు మాధురికి కొనిచ్చాడట వివేక్. అటు భార్యతో గొడవపడి విడాకులకు అప్లై చేసుకున్నాడట భర్త వివేక్. విడాకులు ఇవ్వకుండానే మాధురి తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
ఇక తాజాగా రెడ్ హ్యాండెడ్ గా ఈ జంటను హరిత పట్టుకుంది. భర్త ప్రియురాలుపై భార్య, బంధువులు దాడి చేసి నిలదీశారు. దీంతో ప్లాట్ నుంచి పారిపోయింది ప్రియురాలు మాధురి. భర్త ను పట్టుకొని విశాఖ నుండి బుచ్చయా పేట పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు బంధువులు. ఇక ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.