పోలీసులపై పోలీసులు లాఠి చార్జ్.. షాకింగ్ వీడియో వైరల్?
అయితే ఇలా ఎక్కడైనా ఎవరైనా నేరాలకు పాల్పడిన లేదంటే ఏదైనా విషయంపై నిరసన చేపడుతున్న సమయంలో.. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుంటూ ఉంటారు. పరిస్థితులు అదుపు తప్పకుండా చూసుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి అనిపిస్తే.. ఏకంగా లాటి ఛార్జ్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఇలా ఎంతో మంది నిరసన కారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేసిన ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం మునుపేన్నడు జరగని చూడని ఘటన కావడం గమనార్హం.
ఎందుకంటే ఇటీవలే ఓ ఘటనలో ఏకంగా పోలీసుల పైన పోలీసుల లాఠీ చార్జి చేశారు. అదేంటి అలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు కదా.. జార్ఖండ్ లో ఇలాంటి ఘటన జరిగింది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పై పోలీసులు లాటి చార్జ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఎస్పీవోలు సీఎం హేమంత్ సోరన్ నివాసం వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే ఎస్పీఓలు పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు వర్గాల మధ్య తోపుసలాట జరిగింది. ఈ క్రమంలోనే ఎస్పీలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.