ఫుట్ బోర్డింగ్ చేస్తూ.. రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయిన యువకుడు?

praveen
సాధారణంగా ఎంతో మంది జనాలు ఇక తాము రోజువారి ప్రయాణాలు చేసేందుకు ఆర్టీసీ బస్సు ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం ఏకంగా లోకల్ ట్రైన్లే ఆర్టీసీ బస్సులుగా మారిపోతూ ఉంటాయి. లోకల్ ట్రైన్ల ద్వారానే తమ అన్ని ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ముంబై లాంటి ప్రాంతంలో అయితే లోకల్ ట్రైన్ లలో ప్రయాణికులు ఎంతలా నిండిపోతు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్టిసి బస్సులో ఎలా అయితే బస్సు నిండా ప్రయాణికులు ఉన్నప్పుడు ఫుట్ బోర్డింగ్ చేస్తారో ముంబైలో లోకల్ ట్రైన్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది.

 ఇలా ముంబైలో ప్రతి ఒక్కరు కూడా తమ రోజువారి ప్రయాణాల కోసం ఎక్కువగా ఇలా లోకలు ట్రైన్స్ ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలా లోకల్ ట్రైన్లలో ప్రయాణికులు ఎంత ఎక్కువగా ఉంటారు అన్నదానికి సంబంధించి వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనె ఒకటి వైరల్ గా మారిపోయింది  ఇక ఎప్పటిలాగానే లోకల్ ట్రైన్ లో ఫుట్ బోర్డింగ్ చేస్తూ ప్రయాణిస్తున్న ఒక యువకుడు చివరికి ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇలా ముంబైలోని లోకల్ ట్రైన్ లో ఫుడ్ బోర్డుపై వేలాడుతూ ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ నుంచి పడిపోయాడు. అయితే ఈ వీడియోని మరో ట్రైన్ లో ప్రయాణిస్తున్న యువకుడు ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. కుటుంబం కోసం ఉద్యోగం చేయాలి. ఆఫీసుకు లేటు కావద్దంటే రైళ్లల్లో ఇలా ప్రాణాలకు తెగించాలి. ప్రాణం కంటే కుటుంబం ముఖ్యం. రైల్వేకు మాత్రం మా ప్రాణాలు పట్టవు అని ఇక ఈ వీడియోని పోస్ట్ చేసిన వ్యక్తి ఒక వ్యాఖ్యను కూడా జత చేశాడు. ఇక ఇది కాస్త వైరల్ గా మారిపోతుంది అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: