అత్యాచార బాధితుల అబార్షన్ పై.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు?

praveen
ఈ మధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని మనిషికి ఏదైనా అపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవాడు మనిషి. కానీ నేటి రోజుల్లో పక్కవాడిని ఎలా నాశనం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. ఆడపిల్ల కనిపించింది అంటే చాలు మగాళ్లలో నుంచి మృగం బయటికి వచ్చి ఇక కామంతో ఊగిపోతూ దారుణంగా అత్యాచారాలు చేస్తున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.

 ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఒకప్పుడు పక్కన కుటుంబ సభ్యులు ఉంటే కామాంధులు భయపడేవారు. కానీ ఈ మధ్యకాలంలో పక్కన కుటుంబ సభ్యులు ఉన్న.. వారిపై దాడి చేసిమని అత్యాచారాలు చేస్తున్న ఘటనలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇలా అత్యాచారానికి గురైన ఎంతోమంది బాధిత మహిళలు చివరికి కొన్ని కొన్ని సార్లు గర్భం దాల్చిన ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయ్. ఇలాంటి సమయంలో ఇక ఇలా అత్యాచార బాధిత మహిళలు అబార్షన్ చేయించుకోవచ్చా లేదా అనే విషయంపై ఇటీవల హైకోర్టులో విచారణ జరగగా.. ఈ విషయంపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

 ఇలా అత్యాచారానికి గురైన బాధిత మహిళలు గర్భం దాలిస్తే ఒకవేళ ఆ ప్రెగ్నెన్సీని కొనసాగించాలా లేకపోతే అబార్షన్ చేయించుకోవాల అనే విషయంపై బాధిత మహిళల తుది నిర్ణయం తీసుకోవాలి అంటూ అలహాబాద్ హైకోర్టు సూచించింది. అబార్షన్ కు అనుమతించాలని ఓ మైనర్ కోర్టును ఆశ్రయించిన సందర్భంగా.. ఈ వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. ఒకవేళ బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చి.. బిడ్డను వేరొకరికి దత్తత ఇవ్వాలని భావిస్తే ఇక ఆ బాధ్యతను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వానిదే అంటూ స్పష్టం చేసింది అలహాబాద్ హైకోర్టు. ఇలా హైకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: