ముఖంఫై వాలిన ఈగ.. చివరికి కన్ను పోయింది?
ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అందరిని నవ్విస్తే.. ఇంకొన్ని ఘటనలు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని ఘటనలు భయభ్రాంతులకు లోన్ అయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి తరహా ఘటనల గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సాధారణంగా ప్రతి ఇంట్లో ఈగలు దోమలు లాంటివి ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఈగలు దోమలు లాంటివి మన మీద వాలినప్పుడు వాటిని కొడుతూ ఉంటాం. ఇది సర్వసాధారణంగా అందరూ చేసే పని. కానీ ఇలా తన ముఖంపై వాలిన ఈగను కొట్టాలనుకున్న ఆలోచన.. ఆ వ్యక్తికి శాపంగా మారిపోయింది.
ముఖంపై వాలిన ఈగను కొట్టడం కారణంగా ఒక వ్యక్తి కన్నును కోల్పోయాడు. ఏకంగా తన ఎడమ కన్ను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చైనాలోని ఎన్ జెన్ లో ఉండే ఒక వ్యక్తి తన ముఖం మీద వాలిన ఈగను కొట్టాడు. అయితే గంటలోనే ఎడమ కన్ను ఎర్రగా మారింది. వాపు కూడా వచ్చింది. నొప్పి కూడా మొదలు కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు అయితే కండ్ల కలక కావచ్చు అని అందరూ ముందుగా అనుకున్నారు. అయితే చికిత్స చేసిన అది తగ్గలేదు. చివరికి ఇన్ఫెక్షన్ పెరిగి ఆరోగ్యం క్షమించింది. దీంతో ఇక ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ మెదడుకు చేరుతుందో అన్న కారణంతో వైద్యులు అతని కనుగుడ్డు తొలగించారు.