కనికరం లేని కాలానాగు.. పాలు పోసి పూజిస్తే.. చివరికి?

praveen
.

 పాము ఎప్పటికీ పామే. అది పాలు పోసిన వారినే కాటేస్తుంది. అది దాని స్వభావం. అందుకే పాములకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ ఒక మహిళ పామే దైవం అని భావించింది. అంతే కాదు దానికి నిత్యం పూజలు చేసింది. ఆమె చాలా భక్తి గల మహిళ. రోజూ పరమేశ్వరుడిని పూజించేది. తన ఇంటి ముందు ఉన్న పుట్టలోనే ఆ శివుడు ఉంటాడని భావించి దానికి పూజా కార్యక్రమాలు నిర్వహించేది.

ఆ పుట్టకు పూజ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఆమెకు అందులో ఒక పాము కనిపించేది. అది శివుడు మెడలో ఉన్న పాము అని ఆమె అనుకునేది. అందుకే దానికి రోజూ పాలు పోస్తూ ఉండేది. అయితే అదే పాము ఆమెను కాటు వేసి ఆమె మరణానికి కారణం అయ్యింది ఈ విషాదకరమైన సంఘటన కుటుంబంలో తీవ్ర దుఃఖాన్ని మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలం, గోసం పల్లె గ్రామంలో అలుగుల గంగవ్వ అనే వృద్ధురాలు నివసిస్తోంది. ఆమె వయసు 65 ఏళ్లు. చిన్నతనం నుంచే ఆమెకు దేవుళ్ళపై చాలా నమ్మకం కలిగింది. అందుకే అప్పటినుంచి రోజూ పూజలు చేసేది. పరమశివుడు అంటే ఆమెకు మహా ఇష్టం. ప్రతి సోమవారం ఆయనకు పూజలు చేసేది. శివయ్యను ఆరాధిస్తూ పుట్టలోని పాముకు కూడా డైలీ పాలు పోస్తూ తన భక్తిని చాటుకునేది. ఆ విష సర్పానికి డైలీ పాలు పోయడం ఆమెకు ఒక అలవాటుగా మారింది. అయితే మంగళవారం ఆ పాము పుట్టలో నుంచి బయటికి వచ్చింది. అది ఇంట్లోకి వెళ్ళింది.

అయితే గంగవ్వ ఆ సమయంలో ఇల్లు శుభ్రం చేస్తూ ఉంది. అనుకోకుండా పాముకు తగిలింది. అంతే వెంటనే ఆ పాము గంగవ్వ చేతి పై కాటు వేసింది. సడన్ గా తాను పాలు పోసిన పామే తనను కాటు వేయడంతో గంగవ్వ గుండె పగిలింది. వెంటనే కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వాళ్లు కూడా షాక్ తిన్నారు. అనంతరం ఆమెను హుటా హుటిన సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడం ప్రారంభించారు.

అయితే ఆమె మార్గం మధ్యలోనే తనువు చాలించింది. ఎంతో మంచి మనసున్న గంగవ్వ చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పాము తన నిజ స్వభావాన్ని చూపించిందని, ఆమె మృతి చాలా దురదృష్టకరమని స్థానికులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చాలామంది పాములు కాటు వేసే స్వభావాన్ని కలిగి ఉంటాయని, వాటిని ఎట్టి పరిస్థితులలోనూ చేరదీయరాదని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: