ఓరి నాయనో.. కొడుకు చదవట్లేదని.. తండ్రి ఏం చేశాడో తెలుసా?

praveen
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి మరి చదివిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు వాళ్లు మూడు పూటలా తినకపోయినా పర్వాలేదు. కానీ పిల్లలు మాత్రం బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని అనుకుంటూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో అయితే తల్లిదండ్రులు స్తోమతకు మించి ఏకంగా పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూళ్లలో వేలకు వేల ఫీజులు కడుతూ చదివిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.

 అయితే చదువు అనేది సొంత ఆసక్తి ద్వారా రావాలి. కానీ ఎలాగో ఫీజులు కడుతున్నాము కదా అని రుద్ది రుద్ది చదివిస్తే కొన్ని కొన్ని సార్లు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే ఇలా బడికి వెళ్లిన విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుతారని ఫస్ట్ ర్యాంకుకు వస్తారని.. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ అంటే కేవలం ఒకరికి మాత్రమే వచ్చేది. అయితే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదవడం లేదని తెగ ఆందోళన చెందుతూ ఉంటారు. ఇక ఎవరైనా ఇక పిల్లలు చదువుకోకపోతే తల్లిదండ్రులు మందలించడం చేస్తూ ఉంటారు. లేదంటే అర్థమయ్యేలా చెప్పి బాగా చదువుకునే జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక తండ్రి మాత్రం పిల్లాడు చదవడం లేదని ఊహించని విధంగా విచిత్రంగా ప్రవర్తించాడు.

 ఏకంగా సంచిలో మూట కట్టి కొడుకుని చెరువులో పడేసాడు. అంటే దాదాపు ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడు సదరు తండ్రి  ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కొల్లాపూర్ పట్టణంలో చదువుకోవడం లేదని 8 ఏళ్ల కొడుకుని శతకబాదాడు తండ్రి. అంతేకాదు గోనెసంచిలో మూటకట్టి చెరువులో పడేసాడు. అయితే స్థానికులు గమనించి బాలుడిని కాపాడారు.  సంచిలో కట్టిపడేయడంతో కుక్క అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత అరుపులు వినబడటంతో వెంటనే ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇక స్థానికులు బాలుడిని కాపాడి తల్లికి అప్పగించారు. అయితే స్థానికులు బాలుడి తండ్రిఫై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తండ్రి అయిన ఇలా చేస్తారా అంటూ మండి పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: