అయ్యో దేవుడా.. రెప్పపాటులో చిన్నారి ప్రాణం ఎలా పోయిందో చూడండి?
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా ఇక విధి కొన్ని కొన్ని సార్లు కక్ష కట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. అప్పుడు వరకు కళ్ళ ముందు ఎంతో సంతోషంగా ఆడుకున్న చిన్నారులను ఊహించని ఘటనలు ఏకంగా మృత్యువు ఒడిలోకి చేరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఒక చిన్నారి ప్రాణం పోయిన తీరునీ వీడియోలో చూసి ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కిపడుతున్నారు అని చెప్పాలి.
అప్పటివరకు ఎంతో సంతోషంగా ఆడుకున్న చిన్నారి.. క్షణకాల వ్యవధిలోనే విగత జీవిగా మారిపోయింది. తన ప్రమేయం లేకుండా ఏ చిన్న తప్పు చేయకుండానే.. చివరికి ప్రాణాలు కోల్పోయింది. మూడున్నర ఏళ్ల గిరిజా షిండే మరొక బాలికతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటుంది. అయితే ఓ బాలుడు తన ఇంటి గేటును వేస్తుండగా ఆమె వెళ్లి అక్కడ నిలిచింది. అయితే గేటు ఒక్కసారిగా ఊడి చిన్నారిపై పడటంతో.. ఇక ఆ గేటు కింద నలిగిపోయిన ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఒళ్ళుగా గుగుర్పొడిచే ఈ ప్రమాదం కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూనే సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది.