మనిషిని పూడ్చిన చోట తవ్విన కుక్కలు.. లేచి కూర్చున్న శవం?

frame మనిషిని పూడ్చిన చోట తవ్విన కుక్కలు.. లేచి కూర్చున్న శవం?

praveen
సినిమాలు చూస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాలలో నమ్మశక్యం కాని ఘటనలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే  ఏకంగా చనిపోయారు అనుకున్న వ్యక్తులను పూడ్చిపెట్టిన తర్వాత ఇక కొన్నాళ్ళకి మళ్లీ చూస్తే అక్కడ ఆ వ్యక్తులు ఉండకపోవడం చూస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు పూడ్చిపెట్టిన వ్యక్తులు కూడా మళ్లీ లేచి నిలబడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి సన్నివేశాలు ఏకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాయి. అయితే ఇలా పూడ్చి పెట్టిన వ్యక్తి బ్రతకడం సాధ్యమ అంటే రియల్ లైఫ్ లో మాత్రం అసాధ్యం అంటారు ఎవరైనా.

 కానీ ఈ మధ్యకాలంలో మాత్రం కలలో కూడా ఊహించని గగుర్పాటుకు గురి చేసే ఘటనలు ఎన్నో రియల్ లైఫ్ లో కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏకంగా చనిపోయారు అనుకున్న వ్యక్తులు బ్రతికి రావడం కూడా చూస్తూ ఉన్నాం. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఒక భయానక ఘటన జరిగింది. చనిపోయాడు అనుకునీ ఒక వ్యక్తిని పూడ్చిపెట్టగా అతడు స్పృహలోకి రావడం అందరిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. యూపీలోని ఆగ్రాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల రూపు కిషోర్ అనే వ్యక్తిఫై కొంతమంది దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలోనే అతను చనిపోయాడు అనుకుని ఇక అతన్ని గొయ్యితోవ్వి పూడ్చి పెట్టారు.

 అయినప్పటికీ అతను బ్రతికాడు. జూలై 18వ తేదీన ఆగ్రాలోని ఆర్తోని ప్రాంతంలో అంకిత్, గౌరవ్, కరణ్, ఆకాష్ అనే నలుగురు వ్యక్తులు రూప్ కిషోర్ పై దాడి చేశారు  భూవివాదం కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇలా రూప్ కిషోర్ పై కత్తులతో దాడి చేసి గొంతు కోశారు.  అనంతరం చలనం లేకపోవడంతో చనిపోయాడు అనుకుని భావించి పొలంలో గొయ్యితవ్వి పాతిపెట్టారు. అయితే అతన్ని పాతిపెట్టిన ప్రదేశాన్ని వీధి కుక్కలు తవ్వడం ప్రారంభించాయ్. ఇలా తవ్వుతూ రూప్ కిషోర్ శరీరాన్ని కొరికేసింది కుక్క. దీంతో రూప్ కిషోర్ అకస్మాత్తుగా స్పృహలోకి వచ్చాడు. గట్టిగా అరవడంతో స్థానికులు అతని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: