జిమ్ లో ట్రెడ్ మిల్ పై నడుస్తూ.. ఎలా కుప్పకూలిపోయాడో చూడండి?
ఇలా ఈ మధ్యకాలంలో ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు.. ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. ఘజియాబాద్ అనేది ఫుల్ బిజీగా ఉండే సిటీ. ఇది ఢిల్లీ ఎన్సీఆర్ లో కొంత భాగంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ బిజీ లైఫ్ లో కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిరోజు జింకు వెళ్లడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ప్రతిరోజు లాగానే ఒక జిమ్ లో ట్రేడ్మిల్లిపై నడుస్తూ నడుస్తూ ఒక్కసారిగా ఆగాడు. కొన్ని క్షణాలు అసౌకర్యంగా కనిపించాడు.
ఇక ఇంతలోనే ఒక్కసారిగా గొప్ప కూలిపోయాడు. ఇది చూసిన పక్క వ్యక్తి అదిరిపడ్డాడు. ఏమైందో అని కంగారుగా చూశాడు. సిపిఆర్ చేయడానికి ప్రయత్నించాడు. తర్వాత ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అతని చనిపోయినట్లు వైద్యులు పరీక్షించి నిర్ధారించారు. కార్తియాక్ అరెస్టుతోనే అతను చనిపోయాడని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు అని చెప్పాలి. కాగా పోస్ట్ మార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా గుండెపోటు వస్తే గుండె పనితీరులో కొంత మార్పు వస్తుందని.. కానీ ఐదు గంటలపాటు ప్రాణాలతో ఉండే అవకాశం ఉంటుంది. కానీ కార్డియాక్ అరెస్టు అయితే వెంటనే గుండె ఆగిపోతుందని వైద్యులు చెప్పుకొచ్చారు.