రెప్పపాటులో అంత జరిగిపోయింది.. స్నేక్ క్యాచర్ మృతి?

frame రెప్పపాటులో అంత జరిగిపోయింది.. స్నేక్ క్యాచర్ మృతి?

praveen
సాదరణంగా పాములు పట్టేవాడు. చివరికి ఆ పాము కాటుకే చనిపోయాడు అని ఒక సామెత అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఇలాంటి సామెత కొన్ని కొన్ని సార్లు నిజమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో పాములను పట్టడం కూడా ఒక వృత్తిగా మార్చుకుంటున్నారు ఎంతోమంది. ఈ క్రమంలోనే జనాభాసాల్లోకి పాము వస్తే చాలు ఇక స్నేక్ క్యాచర్లకు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే కొంతమొత్తంలో డబ్బు తీసుకొని ఇక విష సర్పాలను పట్టుకొని అడవుల్లో వదిలేయడం లాంటివి చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇలా ఈ మధ్యకాలంలో ఎంతోమంది ఏకంగా జనావాసాల్లోకి వచ్చిన సర్పాలను ఇక జనాలు కొట్టి చంపేయకుండా ఉండేందుకు ఇలా చాకచక్యంగా పట్టుకొని అడవుల్లో వదిలేస్తూ ఎన్నో పాముల ప్రాణాలను కూడా కాపాడగలుగుతున్నారు. ఇలా స్నేక్ క్యాచర్లు పాములను చాకచక్యంగా పట్టుకున్న వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇక్కడ మాత్రం ఏకంగా ఊహించని ఘటన జరిగింది. అతను ఇప్పటివరకు వందల పాములను పట్టాడు. ఏ పాము ఎలా దాడి చేస్తుంది వాటిని ఎలా చాకచక్యంగా పట్టుకోవాలి అన్న విషయం అతనికి బాగా తెలుసు.

 పాములు పట్టడంలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న సదురు వ్యక్తి చివరికి అదే పాముకాటుతో చనిపోయాడు. మహారాష్ట్రలోని గోండియా నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమీప ప్రాంతాల్లో ఎక్కడ పాము కనిపించిన సునీల్ కు ఫోన్ వచ్చేది. ఆ పాములను పట్టుకుని అడవుల్లో వదిలేస్తూ ఉంటాడు. అయితే ఇలా పాములను కాపాడటంలో అంకిత భావాన్ని చూపే అతనికి సర్ప మిత్ర అనే బిరుదు కూడా ఇచ్చేశారు స్థానికులు. అయితే ఎప్పటిలాగానే విష సర్పాన్ని పట్టుకునేందుకు వెళ్లిన అతన్ని మరణం వెంటాడింది. పామును సంచిలో వేస్తుండగా రెప్పపాటు కాలంలో ఆ పాము  కాటు వేసింది. చివరికి అతని ఆస్పత్రికి తరలించిన ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి పాములు పట్టేవాడు పాము కాటుకే గురై ప్రాణాలు కోల్పోయాడు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: