ప్రియుడితో అడ్డంగా దొరికిన కూతురు.. చివరికి ఏమైందో తెలిస్తే నవ్వాగదు?

frame ప్రియుడితో అడ్డంగా దొరికిన కూతురు.. చివరికి ఏమైందో తెలిస్తే నవ్వాగదు?

praveen
సాధారణంగా గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తికి నేటి సమాజంలో ఉండే గౌరవం అంతా ఇంతా కాదు అన్న విషయం తెలిసిందే. ఏకంగా చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కూడా అతన్ని తోపులా చూడటం చేస్తూ ఉంటారు అందరూ. అంతేకాదు తమకు ఒక కూతురు ఉంటే గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతి తండ్రి కూడా ఆశ పడుతూ ఉంటాడు అని చెప్పాలి. అందుకేనేమో ఈ మధ్యకాలంలో ఎంతో మంది యువత చిన్న చిన్న ఉద్యోగాలు అయినా సరే ఏకంగా పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం.

 అయితే నేటి రోజుల్లో గవర్నమెంట్ జాబ్ కి ఎంత డిమాండ్ ఉంది అన్నదానికి నిదర్శనంగా ఎంతో మంది సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు చేస్తూ ఉన్నారు. ఏకంగా గవర్నమెంట్ జాబు ఉంది అని తెలిస్తే చాలు అందమైన కూతురుని అందవిహీనంగా ఉన్న వ్యక్తికి ఇవ్వడానికి కూడా రెడీ అవుతూ ఉంటారు అని అర్థం వచ్చేలా ఇప్పటికే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. హర్షు అనే ఒక నేటిజన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో చూసి ఇంటర్నెట్ జనాలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

 ఒక గదిలో ఒక అబ్బాయి తో తన కూతురు కలిసి ఉండడాన్ని తండ్రి చూస్తాడు. మొదట ఆ అమ్మాయి తండ్రి చాలా కోపంగా  ఉంటాడు. ఈ క్రమంలోనే తలుపు తెరువు అంటూ కూతురిఫై గట్టిగా అరుస్తాడు. ఇక ఆ తర్వాత కూతురు తలుపు తెరవడంతో లోపల ఎవరో అబ్బాయి సౌండ్ వినిపించింది అంటూ వెతకడం ప్రారంభిస్తాడు. అంతలోనే ఏకంగా మంచం కింద ఒక యువకుడు కనిపిస్తాడు. దీంతో ఆ యువకుడిని కొట్టేందుకు రెడీ అవుతాడు. అతని అంతలోనే అతను ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటాడని కూతురు చెప్పడంతో.. వెంటనే ఆ తండ్రి మనసు మారిపోతుంది. దీంతో వెంటనే ఇలా అమ్మాయితో రూమ్ లో దొరికిన యువకుడికి మర్యాద ఇవ్వడం.. ఏకంగా మంచం మీద కూర్చోబెట్టడం అమ్మాయికి టీ బిస్కెట్లు పెట్టమని చెప్పి అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడమని చెప్పడం చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ సడన్ మార్పు చూసి ఏకంగా సోషల్ మీడియా జనాలు తెగ నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: