దారుణం : తల్లిని చంపేసి.. కొడుకు ఇంస్టాగ్రామ్ లో స్టేటస్ ఏం పెట్టాడో తెలుసా?

praveen
ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఈ సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు మోహం తెలియని వారికి ఏదైనా ఆపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ జాలిపడేవాడు మనిషి. ఇంకొంతమంది కాస్త ముందడుగు వేసి సహాయం కూడా చేసేవారు. కానీ ఇప్పుడు సహాయం చేయడం మాట దేవుడెరుగు.. ఏకంగా సాటి మనుషుల విషయంలో కాస్తయినా జాలి చూపించడం లేదు మనిషి. చిన్న చిన్న కారణాలకి ఏకంగా ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 అయితే ఒకప్పుడు పరాయి వాళ్ళు ఎటు పోయిన పర్వాలేదు. కానీ సొంతవాళ్లు మాత్రం బాగుండాలి అని కోరుకునే వాడు మనిషి. కానీ ఇప్పుడు మాత్రం నేను అనే స్వార్థం ప్రతి ఒకరిలో పెరిగిపోయిన నేపథ్యంలో సొంత వారి విషయంలో కూడా రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి కఠిన జరిగింది. ఏకంగా కని పెంచిన తల్లిని హత్య చేసేందుకు వెనకడుగు వేయలేదు కొడుకు. గుజరాత్ లో ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే కన్నతల్లిని దారుణంగా హత్య చేసిన కొడుకు తల్లితో దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టేటస్ గా పెట్టి అమ్మ నిన్ను చంపినందుకు నన్ను క్షమించండి అంటూ మళ్ళీ పశ్చాత్తాపంతో మెసేజ్ పెట్టాడు.

 ఈ భయానక కథ అందరిని ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది. రాజ్కోట్లో ఈ హత్య జరిగింది. ఏకంగా తల్లిని దారుణంగా గొంతు కోసి చంపాడు కొడుకు. తర్వాత అతను ఇంస్టాగ్రామ్ లో పెట్టిన స్టేటస్ అందరిని భయాందోళనకు గురిచేస్తుంది. సారీ అమ్మ నేను నిన్ను చంపాను. నేను నిన్ను కోల్పోయాను. ఓం శాంతి అని రాశాడు. రాజ్కోట్ లోని యూనివర్సిటీ రోడ్డులోని ప్రభుత్వ క్వార్టర్స్ లో ఇలా కొడుకు తల్లిని హతమార్చడంతో చుట్టుపక్కల వారందరూ కూడా ఉలిక్కిపడ్డారు. 48 ఏళ్ల జ్యోతి బెన్ గోసాయినీ కొడుకు  చంపేసాడు. అయితే మృతదేహాన్ని ఆమె ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా కుమారుడు నీలేష్ గోసాయిని విచారించగా.. తల్లిని తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.  తర్వాత తన స్నేహితుడు భరత్ కి ఫోన్ చేసి చెప్పగా.. ఇక భరత్ పోలీసులకు సమాచారం అందించాడు. తన తల్లి మానసిక వ్యాధితో బాధపడుతుందని.. అందుకే చంపేసినట్లు కొడుకు నిలేష్ చెప్పిన విషయాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: