షాప్ ఓనర్‌కి దిమ్మ తిరిగే షాక్.. ఇలా కూడా చోరీ చేస్తారా..?

frame షాప్ ఓనర్‌కి దిమ్మ తిరిగే షాక్.. ఇలా కూడా చోరీ చేస్తారా..?

praveen

దొంగలు చాలా తెలివితో వస్తువులను కొట్టేస్తుంటారు. ఒక్కోసారి వారి తెలివైన చోరీలు చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు. వీళ్లు మనమధ్యే ఉంటూ మన వస్తువులను చాలా తెలివిగా కాజేస్తుంటారు. ఆ విషయం ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోయేదాకా మనం గుర్తించలేము. దొంగలు దొరక్కుండా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతుంటారు. తాజాగా ఓ కొత్త తరహా చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ దొంగ ఎంతో తెలివిగా దొంగతనం చేశాడు. అది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
ఈ వీడియోలో ఇద్దరు యువకులు ఓ బైకుపై వచ్చి దుకాణం వద్ద సిగరెట్ ప్యాకెట్ కోసం ఆగుతారు. బైక్ రైడర్ బండి మీదే ఉంటాడు. పిలియన్ సీట్ మీద కూర్చున్న వ్యక్తి మాత్రం సిగరెట్ ప్యాకెట్ తీసుకోవడానికి దుకాణం కౌంటర్ వద్దకు వస్తాడు. తర్వాత సిగరెట్ ప్యాకెట్ అడుగుతాడు. షాపు ఓనర్ ఇస్తాడు. అనంతరం ఇదేనా సిగరెట్ ప్యాకెట్ అంటూ బండి మీద కూర్చున్న రైడర్ ని అడుగుతాడు. అంతేకాదు, వినపడట్లేదు అన్నట్లు సైగ చేస్తాడు. "సిగరెట్ ప్యాకెట్ చూపిస్తా ఆగు" అని ఆ సిగరెట్ ప్యాకెట్ తీసుకొని బైక్ పై ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఆ సిగరెట్ ప్యాకెట్ పట్టుకుని బైక్ వెనక కూర్చుంటాడు. అంతే వెంటనే అక్కడి నుంచి వారు పరారవుతారు.
షాపు ఓనర్ ఇది చూసి షాక్ అవుతాడు. సాధారణంగా ఆ యువకుడు దొంగలాగా కనిపించలేదు. చిన్న సిగరెట్ ప్యాకెట్ దొంగతనం చేస్తాడని కూడా ఓనర్ ఊహించలేదు దానికోసం అతడు ఇంత రిస్క్ చేశాడు. బైకు ఒకేసారి ముందుకు దూకడంతో ఆ దొంగ కొంచెం అయితే కింద పడిపోయే వాడు. ఈ వీడియో చూసి చాలామంది ఇది ఎక్కడి దొంగతనం అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల ఓనర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు. ముందుగానే డబ్బులు అడగాలని, వస్తువును చేతికిస్తే అటు నుంచి అటే పరారయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఆ యువకుడు పరువు పోయింది ఇలాంటి చిల్లరి పనులు చేయడం ఎంతవరకు కరెక్టు అని మరి కొంతమంది ప్రశ్నించారు. ఈ వీడియోకు వేలల్లో వ్యూస్ వచ్చాయి. దీన్ని చూసేందుకు ఈ లింకు https://x.com/MojClips/status/1831338959001272331?t=79oD_WyO8phn8QlofUkKOQ&s=19పైన క్లిక్ చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: