భార్యతో శృంగారం కూడా అత్యాచారమే.. బాంబే కోర్టు సంచలనం?
అయితే 18 సంవత్సరాల నిండకుండానే బాల్యవివాహం జరిగినప్పుడు ఇలా మైనర్ గా ఉన్న భార్యతో శృంగారం చేయడం అది అత్యాచారం కిందికే వస్తుంది అంటూ అటు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది భార్యపై అత్యాచారం చేసిన వ్యక్తికి పదేళ్ల శిక్షను సమర్థిస్తూ బాంబే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధ పెట్టుకోవడం అత్యాచారం అంటూ పేర్కొంది. ఆమె వివాహం చేసుకుందా లేదా అన్న విషయంతో కూడా సంబంధం ఉండదు అంటూ బాంబే హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఇలా 18 సంవత్సరాలు లోపు వయస్సు ఉన్న మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అత్యాచారంగానే పరిగణించాలని జస్టి జేఏ సనత్ తెలిపారు. పెళ్లికి ముందు తనతో బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకోవడం కారణంగానే గర్భం దాల్చాల్సి వచ్చింది అంటూ బాధిత మైనర్ మహిళా కోర్టుకు ఎక్కింది. వారికి వివాహమైనప్పటికీ కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో భర్త పై కోర్టుకెక్కింది సదరు మహిళ. అయితే 2019లో ఆమె ఫిర్యాదు చేయడానికి ముందే మూడు నాలుగు ఏళ్ల పాటు ఆ వ్యక్తితో ఇక కలిసి ఉంది సదరు మహిళ. తద్వారా వారి మధ్య లైంగిక సంబంధం ఉండడంతో గర్భం దాల్చింది అయితే ఇలా ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఉన్నప్పుడు ఆమె మైనర్ కావడం.. ఇక ఇప్పుడు భర్తతో విభేదాలు వల్ల బాధితురాలు కోర్టుకెక్కడంతో ఇక అతనికి పదేళ్ల శిక్ష విధించడాన్ని సమర్థిస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.