పుష్ప-2 సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాను చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. టికెట్ల ధరలు ఎక్కువ ఉన్నప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా సినిమాను చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లా నర్సీపట్నంలో సినిమా చూడడానికి ఓ దుండగుడు వచ్చాడు. సినిమా చూసిన అనంతరం బస్టాండ్ లోని బస్సులో తమిళనాడుకు చెందిన సాదిక్ అనే వ్యక్తి పడుకున్నాడు.
బస్సుకు తాళం ఉండటాన్ని గమనించి బస్సును స్టార్ట్ చేసి సీతా రామరాజు జిల్లా చింతలూరు వద్ద ఆపి అక్కడ నిద్రపోయాడు. బస్సు చింతలూరు వద్ద ఉందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బస్సును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అందులో పడుకున్న సాదిక్ అనే దొంగను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.... అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప-2 ది రూల్ సినిమా భారీ బడ్జెట్ తో రిలీజ్ అయింది.
ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. పుష్ప-2 సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే భారీగా వసూళ్లను రాబట్టింది. ప్రముఖ టికెట్ యాప్ బుక్ మై షోలో పుష్ప-2 ఆల్ టైం రికార్డ్స్ సృష్టించింది. ఇప్పటివరకు అత్యధిక టిక్కెట్స్ బుక్ అయిన సినిమాగా కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కే జి ఎఫ్ 2 సినిమా 17.01 మిలియన్స్ బుకింగ్స్ తో టాప్ వన్ లో ఉందని చెబుతున్నారు,
ప్రభాస్ నటించిన బాహుబలి 2 రెండవ స్థానంలో ఆర్ఆర్ఆర్ మూడవ స్థానంలో ఉన్నాయి. అయితే ఈ సినిమాలను అధిగమించి పుష్ప-2 సినిమా నంబర్ వన్ స్థానం చేరుకుంది. మూడవ వీకెండ్ లో సూపర్ బుకింగ్స్ రాబట్టుకొని మొత్తంగా 18 మిలియన్ బుకింగ్స్ తో ఇప్పటివరకు ఎవరు టచ్ చేయలేని రికార్డులను మన అల్లు అర్జున్ క్రియేట్ చేశాడు.