వెచ్చదనం కోసం చలిమంట కాచుకుంది.. చివరికి ప్రాణం పోయింది?

praveen
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం, హస్తాల్‌ పూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ విలేజ్ కి చెందిన మామిండ్ల బుచ్చమ్మ (55) చలి మంటల కాటుకు బలయ్యారు. 2024 డిసెంబర్ 19వ తేదీ రాత్రి, చలి తీవ్రంగా ఉండటంతో బుచ్చమ్మ చలి కాచుకునేందుకు మంట వేశారు. ఆ వెచ్చని మంటను ఆస్వాదిస్తూ ఆమె పరధ్యానంలో మునిగిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఆమె చీరకు నిప్పంటుకుంది. క్షణాల్లో మంటలు ఆమె శరీరం మొత్తానికి వ్యాపించడంతో తీవ్ర గాయాలయ్యాయి.చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన బుచ్చమ్మను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ గాయాలు తీవ్రంగా ఉండటంతో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
బుచ్చమ్మ మరణంతో హస్తాల్‌పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆమె మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. చలి నుంచి ఉపశమనం పొందాలని చేసిన ప్రయత్నం ఇంతటి విషాదానికి దారితీయడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన చలికాలంలో మంటల వద్ద ఎంత జాగ్రత్తగా ఉండాలో మరోసారి గుర్తు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈదురు గాలులు భారతదేశ వ్యాప్తంగా వీస్తున్నాయి. దానికి తుఫాను తోడయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో బాగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ఫలితంగా ఇంట్లో నుంచి బయటికి రావడానికి ప్రజలు చంపుతున్నారు. ఈ వాతావరణంలో ఇంకా మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ చల్లటి వాతావరణం లో పాములు ఇళ్లలోకి చేరబడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంకా రెండు నెలల చలికాలం పూర్త ఎండాకాలం ప్రారంభమవుతుంది అప్పుడు ఎండలు మండుతాయి. ఆ కాలంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: