ప్రపంచాన్నే ఏలిన దేశం.. ఇప్పుడు సైన్యం అంత బలహీనమా?

Chakravarthi Kalyan
మనిషికి శ్రమ మాత్రమే కాదు, సుఖం ఎక్కువైనా కష్టమే. శ్రమించడం అలవాటు పడిన వాడు ఏ కష్టానికైనా తట్టుకోగలుగుతాడు. అదే సుఖానికి అలవాటు పడిన వాడు కొంచెం కష్టం వచ్చిందంటే తట్టుకోలేడు. ఏసీల్లో బతికేవాడు ఎండల్లో తిరగలేడు. గొప్ప పేరు పొందిన అగ్రరాజ్యాలలోని ప్రజలు గొప్ప లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ ఉంటారు. వారి జీవితం అతి సున్నితంగా వెళ్తూ ఉంటుంది.


సరైన ఎండకి, సరైన వాతావరణ మార్పుకి కూడా వాళ్ళు తట్టుకోలేక పోతారు. ఏదైనా ఒక తీవ్రమైన ఇన్సిడెంట్ జరిగితే గనక ఇక అంతే సంగతి. ఇంటి నుండి కూడా బయటికి రారు. అమెరికాలో ట్విన్ టవర్స్ కూలినప్పుడు అక్కడ జనాలు అయితే చాలాకాలం వరకు బయటకు రాలేదు అని తెలుస్తుంది. వాతావరణ మార్పులు, ప్రమాదాలు ఇవన్నీ ఎవరి జీవితం లోనైనా చాలా సాధారణమైనవే.


కానీ అగ్ర రాజ్యాలలోని జనాలకు వాళ్ల అతి సున్నితత్వమే వాళ్ళకి సమస్యలను తీసుకొస్తుంది. మన భారతదేశ జనాభా 145 కోట్లు అయితే దానిలో మూడోవంతు ఉన్న అమెరికా జనాభా 35 కోట్లు. అయితే కరోనా కారణంగా అమెరికాలో చనిపోయిన వాళ్ళ లెక్కయితే 13 నుండి 15  లక్షలు ఉంటే, భారత్ లో మాత్రం ఐదు ఆరు లక్షల మంది చనిపోయారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆఫ్రికా దేశాలు ఇంకా ఆసియా దేశాలు కూడా కరోనా సంక్షోభాన్ని గట్టిగానే చవి చూసాయి.


అమెరికా దేశాలు కూడా చవి చూసాయి. అయితే అగ్ర రాజ్యాలకన్నా వెనుకబడిన దేశాలు మాత్రమే ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి అని తెలుస్తుంది. వ్యాక్సిన్ ఉండి కూడా అమెరికా లాంటి అగ్ర దేశాలు కరోనా దెబ్బకి నలిగి పోయాయి. ఎండలను మాత్రమే కాకుండా ప్రకృతిలోని ప్రతి మార్పుకి ఎదురు నిలిచి మరి పోరాడే సైనికులు కూడా ఎండ దెబ్బకి పడిపోతున్నారట. బ్రిటన్ లోని రాయల్ సైన్యం పెరేడ్ చేస్తుండగా ఎండ దెబ్బకి పడిపోయారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: