జగన్ జోరు: చంద్రబాబు ఆస్తుల జప్తు తప్పదా?
టీడీపీ అధినేత ఇల్లు అని దాన్ని అటాచ్ చేయాల్సిన అవసరం ఉందని ఏసీబీ ఆధ్వర్యంలోని సిట్ చెబుతోంది. పోనీ లింగమనేని ఆస్తి అయితే అందుకు చంద్రబాబు చెల్లించే అద్దె వివరాలు ఉండాలి. కానీ అవేవీ లింగమనేని బ్యాంకు లావాదేవీల్లో కనిపించడం లేదు. కాబట్టి అది కాదని తెలుస్తూనే ఉంది. అయితే లింగమనేని అపార్ట్ మెంట్ లకు సంబంధించి టీడీపీ అధికారంలో ఉన్నపుడు నెలకు దాదాపు రూ. 2.50 కోట్ల వరకు ప్రభుత్వం అద్దె చెల్లించేదని అందుకు ప్రతిఫలంగా క్విడ్ ఫ్రో కో విధానంలో చంద్రబాబుకు ఫ్రీగా ఉండేందుకు లింగమనేని గెస్ట్ హౌజ్ ఇచ్చారని విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
ఇక్కడ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అవడమే కాకుండా దాన్ని క్విడ్ ఫ్రో కో రూపంలో తీసుకున్నట్లు సిట్ చెబుతోంది. దీంతో చంద్రబాబు ఆస్తి అయిన గెస్ట్ హౌస్ ను స్వాధీనం చేసుకుంటారా? చంద్రబాబు ఆస్తిని అటాచ్ చేస్తారా అనే ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. చివరి ఏడాది ఎన్నికలు ఉన్నాయనగా సీఎం జగన్ ఎదురుదాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్న రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు మీద ఎటాకింగ్ కు దిగుతున్నారు. దీని వల్ల జగన్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా.. చంద్రబాబు ఆస్తి అటాచ్ అవుతుందా లేదా చూడాలి.