టీడీపీకి షాక్‌: సీఎంగా పవన్‌ కల్యాణ్‌.. తగ్గేదే..లే?

Chakravarthi Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల్లో కాస్త నిజాయతీ కనిపించింది. సీఎం జగన్ ను గద్దె దించాలనే మాటతో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం మాట్లాడిస్తున్న మాటలు పవన్ చెబుతున్నారనే విమర్శలు చేస్తున్నారు వైసీపీ నాయకులు. చంద్రబాబు తో అరడజను సార్లు పవన్ సమావేశమయ్యారని లోకేశ్ ప్రకటించడం, దీనికి టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించేవారు.


అయితే జనసేన నాయకులు మాత్రం ఈ మాటల్ని అన్ని కొట్టే శారు. అయితే ఇవన్నీ మాటల మధ్య పవన్ కల్యాణ్ ఒక భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. అది 2024, 2029లో నాకు అధికారం ఇవ్వండని అడిగారు. ఈ రెండు సార్లు నాకు అధికారం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ మారుస్తాను. ఒక వేళ అలా మార్చని పక్షంలో నన్ను అధికారంలో నుంచి తీసేయండని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను పని చేయకపోతే మాత్రం కచ్చితంగా రాజీనామా చేస్తానని ప్రకటించారు.


పవన్ కల్యాణ్ స్పీచ్ తెలుగు దేశం అనుకూల మీడియా తమదైన స్టైల్ లో వార్తలు రాశాయి. జగన్ ను గద్దె దించాలని చెప్పిన పవన్ మాటల్ని హైలైట్ చేస్తూ పతాక శీర్షికలను పెట్టాయి. కానీ రెండు సార్లు అధికారం ఇచ్చే విషయం మాత్రం ఎక్కడో చిన్నగా రాసుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఒక్క సారిగా స్వరం పెంచి జనసేనకు అధికారమివ్వడం గురించి మాట్లాడటంతో ఆయన వ్యాఖ్యల్ని తెలుగు దేశం అనుకూల మీడియా నార్మల్ గా రాసుకొచ్చాయి.


సీఎం అయిన తర్వాత ప్రజలకు అనుకూల పనులు చేయకపోతే నన్ను రాజీనామా చేయమని వారు అడగవచ్చు. అప్పుడు కచ్చితంగా నేను రాజీనామా చేస్తానని పవన్ ప్రకటించారు.  గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవికీ సరిగా పని చేయకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించిన నేత పవన్ కల్యాణే కావచ్చు. కానీ ఇన్ని రోజులు టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన పవన్ ఒక్కసారిగా స్వరం మార్చడం వెనక ఉన్న మతలబు ఎవరికీ అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: