యుద్ధం: ఆ దేశాలు.. అమెరికాని నమ్మట్లేదా?

Chakravarthi Kalyan
ఏ ఆటైనా, ఏ జట్టైనా, ఏ గ్రూప్ అయినా వాళ్లలో వాళ్లు  విభేదించుకోవడం సహజం. అలాగే మేము కలిసి ఉన్నాం అని చెప్పుకునే దేశాలు కూడా నిజానికి కలహించుకుంటూనే ఉంటాయట లోలోపల. ఎన్డీఏ నుండి అకాళీదళ్, జెడీయు, తెలుగుదేశం పార్టీ  బయటికి వెళ్లడం కూడా కలహాల వల్లే. యూపీఏ నుండి  కాంగ్రెస్, ఇతర పార్టీలు బయటకు వచ్చిన కారణం విభేదాలే కదా అని అంటున్నారు కొంత మంది.


అయితే ఇవన్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ లోని దేశాల మధ్య విభేదాలు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ సైన్యం యూరోపియన్ యూనియన్ వైపుగా ఉంది. నాటో కూడా యూరోపియన్ యూనియన్ వైపే ఉంది. అయితే అక్కడ సైన్యాన్ని, యూరోపియన్ యూనియన్ ని నడిపేది మాత్రం అమెరికా చెప్పుచేతల్లో ఉండే వాళ్లే అని తెలుస్తుంది.


అయితే యూరోపియన్ యూనియన్ వాళ్లు సరైన సెక్యూరిటీ వ్యవస్థను కూడా రూపొందించుకోలేదు అని తెలుస్తుంది. వాళ్లు సెక్యూరిటీ కోసం అమెరికా మీద ఆధారపడ్డారని తెలుస్తుంది. అయితే అమెరికా మీద ఆధారపడిన అరబ్ దేశాలూ, జపాన్ ఇంకా దక్షిణ కొరియా  ఇబ్బంది పడ్డాయని తెలుస్తుంది. ఆ దేశాల దగ్గర అమెరికా డబ్బులు అయితే తీసుకుంది. కానీ దాని సాయం అవసరమైనప్పుడు మాత్రం అమెరికా మీ ఆయుధాలు మీరే కొనుక్కోండి అన్నట్లుగా తెలుస్తుంది.


అమెరికాని నమ్ముకున్న ఉక్రెయిన్ కూడా నాశనం అయిపోతుంది. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఇప్పుడు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. యూరోపియన్ యూనియన్ కి ప్రత్యేకమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఉండాలి, అమెరికా మీద ఆధారపడకూడదు అని అన్నాడట. అమెరికాను పక్కనపెట్టి యూరోపియన్ యూనియన్ కు లీడ్ వహించాలని ఆయన తపన. తన స్వదేశంలో తనతో పాటు తన ప్రత్యర్థి సమానం అయిపోయాడు. దానికి కవర్ చేయాలంటే ఆయన అంతర్జాతీయ నాయకుడుగా మారి తన దేశంలో కూడా గుర్తింపు సాధించాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR

సంబంధిత వార్తలు: