మోదీ ఆ ఆలోచన.. కాంగ్రెస్‌కు మేలు చేస్తుందా?

Chakravarthi Kalyan
ఎక్కడైనా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోల్పోవడం, మళ్లీ అధికారంలోకి రావడం ఇప్పుడు కామన్ అయిపోయింది. అయితే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని గతంలో ఎవరూ ఊహించలేదు. ఐకె. గుజ్రాల్, వీపీ సింగ్, దేవేగౌడ, వాజ్ పేయీ లాంటి వారు కేంద్రంలో అధికారం చేపట్టారు. 1999 నుంచి 2003 వరకు ఎన్డీఏ హయాంలో వాజ్ పేయి ప్రధాని ఉన్నారు.


ఆయన అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారు. అందులో ముఖ్యంగా దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు రహదారుల నిర్మాణం, ఇన్ ప్రా స్టక్చర్ డెవలప్ మెంట్, ఉపాధి కల్పన ఇలా అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ఎవరూ అనుకోలేరు కాంగ్రెస్ 2004 లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు. 2004, 2009 సంవత్సరంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ పోరాటంగా మారిపోయింది.


కాంగ్రెస్ అధికారంలో నుంచి దూరమైనటువంటి ఈ సమయంలో ముస్లిం ఓట్లు ప్రాంతీయ పార్టీలకు పడుతున్నాయి. దీంతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరమవుతున్నట్లు ఆ పార్టీ భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ వేసుకుంది. ముస్లిం ఓట్లను ఏకంగా కాంగ్రెస్ కు వేసేలా రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు. దీని ఇంపాక్ట్ కర్ణాటకలో విజయం సాధించారు. హిందువుల్లో ఐక్యత ఉండకపోవడం, కులాలు, వర్గాల వారీగా కొట్టుకోవడం వల్ల కాంగ్రెస్ ముస్లిం ఓట్లే కీలకంగా మారనున్నాయి.


అయితే కామన్ సివిల్ కోడ్ తీసుకువస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. దీన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల ముస్లిం సమాజానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ముస్లింల ఓట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా పడాలంటే ఏం చేయాలి. వారిని తిరిగి హస్తం పార్టీ వైపు మళ్లించేలా రాహుల్ గాంధీ ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వరా కేంద్రంలో అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: