పొత్తుల లెక్కలతో జుట్టు పీక్కుంటున్న బాబు?

Chakravarthi Kalyan
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పార్టీ నేతలకు ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే సీటు కావాలని తన దగ్గరకు వచ్చి అడిగిన ప్రతి ఒక్కరికి నేను చూస్తాను అని చెప్తారు చంద్రబాబు. అయితే చివరికి వచ్చేసరికి ఎవరో ఒక వ్యక్తిని తీసుకువచ్చి ఈయనను గెలిపించండి అని అంటూ ఉంటారు. అయితే అప్పటి వరకు ఖర్చు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడిగితే తర్వాత చూద్దాం అని అంటారట.

తీరా తర్వాత విషయం తర్వాత అయిపోతుంది. ఈ రకంగా అప్పటివరకు డబ్బులు పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి అయోమయం అయిపోతుందట. ఈలోపు డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టేటువంటి తటస్థులు కూడా మధ్యలో వచ్చేస్తూ ఉంటారట. ఇక పొత్తుల విషయానికొస్తే భారతీయ జనతా పార్టీతోను, ఇంకా జనసేన పార్టీతో సాగుతాను అంటున్నారు.  ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఈ పొత్తుల పేరు చెప్పుకొని అనేది స్పష్టం అవ్వలేదు.

ఇప్పటివరకు ఉన్నవి 175 సీట్లు.. దానికి కాంపిటీషన్ అయితే 1000 మందికి పైగానే ఉంటారు. డబ్బులు కూడా 10 కోట్ల నుండి 50 కోట్ల వరకు ఖర్చు పెట్టుకునే వారు కూడా ఉన్నారు సీటు కోసం. అయితే వాళ్లలో ఎవరికీ చంద్రబాబు నాయుడు ఇంకా క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. ఎందుకంటే పొత్తుల పై సందిగ్ధత నెలకొంది కాబట్టి. పవన్ కళ్యాణ్  కాపులు ఎక్కువగా ఉండే స్థానాలు  కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

అయితే అసలు తెలుగు దేశంతో పొత్తు ఇంట్రెస్ట్ లేని బిజెపిని  జనసేనని మధ్యవర్తిగా పెట్టి బలవంతంగా తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు బిజెపికి ఎన్ని ఇస్తారో, జనసేనకి ఎన్ని ఇస్తారో అనేది స్పష్టం చేస్తే ఆ సీట్ల కోసం ఎదురుచూసే వాళ్ళకి  అయితే వాళ్లకు సీటు వస్తుందని ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే రేపు ఎంఎల్సీ ఇస్తారో, మరో స్థానం ఇస్తారో  అనేదానిపై వాళ్లకు ఒక స్పష్టత ఉండటం అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: