పురందేశ్వరి ఎంపిక వెనుక.. ఇంత కులరాజకీయమా?
అయితే అయిదు రాష్ట్రాల అధ్యక్షులను బీజేపీ మార్చింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరీని నియమించారు. అంతకుముందు బీజేపీ అధ్యక్షులను మారుస్తూ నిర్ణయం తీసుకుంటుందనే వార్తలు వినిపించిన సమయంలో అందరూ సత్య కుమార్ కు బీజేపీ అధ్యక్ష పదవి ఖాయమైపోయిందనే వార్తలు వినిపించాయి. సత్యకుమార్ వెంకయ్య నాయుడు శిష్యుడు కావడం, సత్యకుమార్ ముందు నుంచి బీజేపీలో నే ఉండడం కలిసొచ్చే అంశమని అందరూ భావించారు. కానీ బీజేపీ అధిష్టానం అందరికీ షాకిస్తూ పురందేశ్వరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు.
పురందేశ్వరీ నియామకం వెనక పెద్ద ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో పురందేశ్వరీ కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకురాలు కావడం, ఆమెకు కాంగ్రెస్ లో ఉన్న నాయకులు టచ్ లో ఉండడం. గతంలో కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రిగా పని చేయడంతో క్షేత్ర స్థాయిలో కూడా ఆమెకు కార్యకర్తలతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇది క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ లో ఉన్నవారందరినీ బీజేపీలో చేర్పించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని అధిష్టానం నమ్మకం పెట్టుకుంది.
ఏపీలో బీజేపీ టీడీపీతో, జనసేనతో కలిసి వెళితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి. వారితో కలిసి ఆమె ఎలా ప్రయాణిస్తారు. ఒక వేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ప్రజల్లోకి పార్టీని ఎలా తీసుకెళ్లగలుగుతారనే సందేహాలు పార్టీ కార్యకర్తల్లో నెలకొన్నాయి. బీజేపీని ఆంధ్రలో గెలిపించడం అంత సులభం కాదని ఆమెకు తెలుసే.. ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.