బీజేపీ.. ఆ సాహసం చేస్తుందా?

Chakravarthi Kalyan
భారతీయ జనతా పార్టీ గతంలో ఢిల్లీ లోనూ, మరికొన్ని రాష్ట్రాలలో జరిగిన పరాభవాన్ని దృష్టిలో  ఉంచుకొని  పావులు కదుపుతూ వెళుతుందని తెలుస్తుంది‌. గతంలో భారతీయ జనతా పార్టీ డాక్టర్ హర్ష వర్ధన్‌ను అధ్యక్షుడిగా నియమించింది. గతంలో ఢిల్లీలో ఉన్న 62 సీట్లలోనూ 31 హర్షవర్థన్‌ గెలుచుకున్నాడని తెలుస్తుంది. ఆ తర్వాత స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాలు గెలుచుకుందని తెలుస్తుంది.


అప్పుడు మిగిలిన నాలుగు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందట. ఆ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీకి గతంలో కన్నా ఒక సీటు తగ్గిందని తెలుస్తుంది. దాంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిందట. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరచింది అని తెలుస్తుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి తాను ఇచ్చిన మద్దతుని ఉప సంహరించుకుంది అని తెలుస్తుంది.


అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆ 4 స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీలోకి వెళ్లిపోవడానికి మొగ్గు చూపారట. ఆ లెక్కన ఆల్రెడీ 31 స్థానాలు ఉన్న భారతీయ జనతా పార్టీకి మరో నాలుగు స్థానాలు కలిసి వచ్చి 35 స్థానాలు ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ తాను ప్రభుత్వం ఏర్పరిచేంత శక్తిని అయితే కలిగి ఉంది. అయినా అమిత్ షా మాత్రం ఎన్నికలకే వెళదాం అంటూ తన ఛాయిస్ ని చెప్పేసారట.


2014 ఎలక్షన్లలో ఆ పార్టీ  విజయం సాధించడంతో ఆయన ఎన్నికలకు వెళ్ళడానికే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఏ నిర్ణయం అయినా తీసుకునేటప్పుడు అంతా మంచే జరుగుతుంది అని ఆశిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత జరిగేది మంచి అయినా, చెడైనా వాళ్లు తప్పక భరించాల్సి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఇప్పుడు బిజెపి రకరకాల వ్యూహాలు వేస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: