ఎన్టీఆర్‌ను తలపిస్తున్న పవన్‌ కల్యాణ్‌ దూకుడు?

Chakravarthi Kalyan
పవన్ కల్యాణ్ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆయన దూకుడు స్వభావం ఆయనకు విజయం చేకూరుస్తుందా లేక ఓడిపోయేలా చేస్తుందా అనేది త్వరలోనే తేలిపోనుంది.  గతంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన సమయంలో ఆయనకు సినిమా నటుడిగా చాలా క్రేజ్ ఉండేది. అలాంటి సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు.


ఒకానొక సమయంలో ఆయన వాడిన పదజాలంపై అప్పట్లో ఆంధ్రభూమి పత్రికలో ఎన్టీఆర్ లాంటి నాయకుడు, సీనియర్ నటుడు మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఏకంగా ఆర్టికల్ రాశారు. రాజకీయాల కోసం ఆయనలో ఉన్న నటుడు కాస్త విమర్శకుడిగా మారి కాంగ్రెస్ ను ఇందిరా గాంధీని తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఎన్టీఆర్ లో ఇలాంటి ఒక కోణం ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు.


ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా దూకుడు స్వభావంతో ముందుకెళుతున్నారు అధికార వైసీపీ పై ఆ పార్టీ నాయకులపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్  చేస్తున్న పనుల్లో అవినీతి ఎక్కువగా జరుగుతోందని ఎమ్మెల్యేలు కూడా చాలా మంది అవినీతి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు పవన్ కల్యాణ్ ప్రజల్లోకి రాకముందు లోకేశ్ పాదయాత్రే హైలైట్ గా కనిపించేది. పవన్ దెబ్బతో లోకేశ్ పాదయాత్ర చేస్తున్న విషయం కూడా తెలియకుండా పవన్ క్రేజ్ కి మీడియా ఎక్కువ ప్రచారం చేసేస్తుంది.


2019 ఎన్నికలకు ముందు వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా పాదయాత్ర చేస్తూ జనాల్లోకి వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీని తన భూజాలపై వేసుకుని మరీ ముందుకు నడిపించారు. దాని ఫలితమే ఆయన్ని అధికారంలో కూర్చొబెట్టింది. రాజకీయాల్లో పాదయాత్రలు, ప్రజల మధ్యకు వెళ్లే నేతలను అభిమానిస్తున్నారు. కష్టాలు తీర్చి ఆదుకుంటారని జనాలు ఆశిస్తున్నారు. కాబట్టి పవన్ కూడా ప్రజల్లోకి వెళుతున్నారు. ఆయనకు అధికారం ఇస్తారా..  ఈ సారి ఎన్ని సీట్లు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: