పాకిస్థానీ ఆంటీ.. యమా ఖతర్నాక్?
అయితే ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ నుంచి ముందు దుబాయ్ వెళ్లి.. అనంతరం నేపాల్ వచ్చి అక్కడి నుంచి యూపీకి వచ్చింది. కానీ యూటీసీ విచారణలో మాత్రం ఆమె నేపాల్ నుంచి ఢిల్లీకి వెళ్లిందని అక్కడ చాలా మంది తో ఆమె కాంటాక్ట్ అయిందని తేలింది. ఆమె ఢిల్లీలో ఎవరెవరినీ కలిశారు. ఏం చర్చించారు.
సీమా ఇండియాకు ఎందుకు వచ్చింది. దాని వెనక ఉన్న కారణాలేంటి తదితర విషయాలను యూటీసీ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే సీమా పై అక్రమ వలసదారుల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం గూడచార్యం అనే కేసును కూడా పెట్టబోతున్నారు.సీమా హైదర్ ను చూపించి ఆమెను వెనక్కి పంపకపోతే ముంబాయి ఎటాక్ తరహా దాడులు చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.
సీమా హైదర్ మాత్రం తాను ప్రేమించిన వ్యక్తి కోసమే వచ్చానని చెప్పిన ఆమె హిందువుగా కూడా మారానని చెప్పడంతో గోరక్షక దళ్ ఆమెపై విచారణ జరపాలని తక్షణమే పాకిస్థాన్ పంపించేయాలని డిమాండ్ చేసింది. యూటీపీ పోలీసులు కూడా పాక్ లోని భారత హై కమిషనర్ కు ఆమె వివరాలు కావాలని కోరింది. అయితే సీమా హైదర్ సోదరుడు ఆర్మీలో పని చేస్తున్నట్లు, ఆమె కుటుంబానికి వ్యక్తులు పాక్ ఆర్మీలో ఉన్నట్లు సీమా భర్త తెలపడంతో కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.