కర్నూలులో హైకోర్టు.. ఎంతవరకూ సాధ్యం?

frame కర్నూలులో హైకోర్టు.. ఎంతవరకూ సాధ్యం?

Chakravarthi Kalyan
కర్నూల్ లో హైకోర్టుకి సంబంధించి షిప్టింగ్ కు సంబంధించిన వ్యవహారం ఎంతదాకా వచ్చిందని ఇటీవల పార్లమెంట్ లో ఓ వైసీపీ ఎంపీ ప్రశ్నించారు. దానికి సమాధానంగా పార్లమెంటు అలాంటి ప్రతిపాదనేమీ తమ వద్ద లేదని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో సంప్రదింపులు జరిపి చేసుకోవచ్చని తెలిపింది. హైకోర్టు తరలించడం కష్టం ఏమీ కాదు. హైకోర్టు న్యాయమూర్తులను సంప్రదించి దాన్ని షిప్టు చేయవచ్చు. కానీ దానికి సంబంధించి మాత్రం హైకోర్టు న్యాయవాదులు, న్యాయమూర్తులకు కనీస సౌకర్యాలు కూడా దొరకడం కష్టంగా ఉంటుంది.

అయితే ప్రభుత్వం కర్నూలు హైకోర్టుకు ప్రతిపాదించిన స్థలం అటు సిటీ కాకుండా ఇటు పల్లెటూరు కాకుండా మధ్యలో ఉంది. పల్లెటూరు మధ్యలో ఉంది. సాధారణంగా కోర్టుల పక్కన లాయర్ల ఆఫీస్లు ఉంటాయి. నల్ల కోట్లు అమ్మే దుకాణాలు ఉంటాయి. మిగతా పత్రాలు అమ్మేవి అన్ని ఉంటాయి. ఇక్కడ మాత్రం ఎలాంటి దుకాణ సముదాయాలు లేవు. కోర్టు లోపల మాత్రమే టీ స్టాల్ ఉంది. బయట ఎలాంటి షాపులు లేవు.

అయితే ఆ హైకోర్టు చుట్టు పక్కలా ప్రాంతాలు అన్ని ప్రభుత్వ భూములు కావడం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. లీజుకు తీసుకోవాలన్న ప్రభుత్వం జీవో ఇస్తే మాత్రమే భూమి ఇవ్వడం సాధ్యమవుతుంది. దీని కోసం కొత్తగా ప్రభుత్వం జీవో తీసుకురావాల్సి ఉంటుంది. మూడు రాజధానుల లాంటి ప్రాంతంలో రాజధాని అంశం మాత్రం ఈజీ కాదు. కానీ హైకోర్టును మాత్రం కట్టవచ్చు. దానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చవచ్చు.

అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి దానిపై దృష్టి పెడితేనే సాధ్యమవుతుంది. మూడు రాజధానుల తర్వాత కర్నూల్ లో హైకోర్టు అనే అంశంపై పార్లమెంట్ లో వైసీపీకి ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: