ఏపీ ఎన్నికలపై సంచలన సర్వే ఫలితాలు?

Chakravarthi Kalyan
సాధారణంగా ఎన్నికల ముందు కొన్ని న్యూస్ చానల్స్, అలాగే సర్వే కంపెనీలు ప్రజా అభిప్రాయాన్ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. వాటి సర్వేల ఫలితం ప్రజాభిప్రాయం నుండి వచ్చింది కాబట్టి చాలా వరకు ఫలితాలు కరెక్ట్ గానే ఉంటాయి. ఒకవేళ ఎన్నికల సమయంలో ఓటర్ మూడ్ ను బట్టి ఇది మారే అవకాశం కూడా లేకపోలేదు.  కానీ చాలా వరకు ఈ ఫలితాలు నిజమే అవుతాయి. వచ్చే ఏడాది ఆంధ్రాలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుండే చాలా న్యూస్ చానల్స్  తమ సర్వేను మొదలుపెట్టేసాయి.


అందులోనూ ప్రత్యేకించి జాతీయ న్యూస్ ఛానల్స్ రాబోయే ఎలక్షన్స్ పై సర్వేలు నిర్వహించాయి. అయితే వాటి ఫలితాల ప్రకారం ఆంధ్రాలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుంది అనే విషయం తెలుస్తుంది. జాతీయ స్థాయి సర్వేలలో ముఖ్యంగా ఇప్పుడు టైమ్స్ నౌ అలాగే ఇండియా టుడే సర్వేలు వెళ్లడయ్యాయి. వాటి లెక్కల ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరో సంస్థ తన సర్వే ఫలితాన్ని ప్రకటించింది.


ఇండియన్ టీవీ అయినటువంటి సి ఎన్ ఎక్స్ తన ఒపీనియన్ పోల్ లో ఆంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 46% ఓట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. అయితే గత ఎలక్షన్లలో చూస్తే 50% ఓట్లతో గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్లలో 46 శాతానికి అంటే నాలుగు శాతం తక్కువ ఓట్లతో గెలుపు సాధిస్తుందని అంటున్నారు.


అలాగే 40 శాతం ఓట్ బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీ 36 శాతానికి అంటే నాలుగు శాతం దానికి కూడా తగ్గి ప్రతి పక్షంలోనే ఉంటుందని సర్వే ఫలితాన్ని ప్రకటించింది. అలాగే భారతీయ జనతా పార్టీ, జన సేన కూటమి 8శాతం ఓట్లు సాధిస్తుందని సర్వే ప్రకటించింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి 3శాతం వస్తాయని, ఇతరులందరికీ కలిపి 7శాతం వస్తాయని ఆ సర్వే ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: